ప్రస్తుత రోజులలో వయసుతో సంబంధం లేకుండా అనేకమంది ప్రేమలో పడుతున్నారు.ఈ క్రమంలో ప్రేమ జంటలు బహిరంగ ప్రదేశాలలో చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు.
ఇక మరికొందరు అయితే దారుణంగా రోడ్లపై, బహిరంగ ప్రదేశాలపై, రైల్వే స్టేషన్లలో, మెట్రో స్టేషన్లలో( railway stations, metro stations ) ఇలా ఎక్కడపడితే అక్కడ ముద్దులు, హగ్ లతో చెలరేగిపోతున్నారు.ప్రేమకు వయసుతో సంబంధం లేకపోవడం మామూలే.
కానీ ఈ మధ్యకాలంలో ఆ ప్రేమ పేరుతో బహిరంగ ప్రదేశాలలో యువతీ యువకులు రెచ్చిపోతున్నారు.
చుట్టుపక్కల ఎంతమంది ఉన్నా తనకేమీ పట్టవు అంటూ రొమాన్స్ లో మునిగి తేలుతున్నారు.ఇందుకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో అనేకం చూసాం.తాజాగా మరో సంఘటన అచ్చం అలాగే జరిగింది.
తాజాగా కోల్‌కతా మెట్రో స్టేషన్ లో ఒక ప్రేమ జంట ( love couple )ముద్దు పెట్టుకుంటూ రొమాన్స్ లో మునిగిపోయారు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.
కోల్‌కతా లోని కాళీఘాట్ మెట్రో స్టేషన్లో( Kalighat Metro Station ) ఒక జంట హద్దు మీరి ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.చుట్టుపక్కల జనాలు వారి గుండా వెళ్తున్నా కానీ, పట్టించుకోకుండా వారు లిప్ టూ లిప్ కిస్సులో మునిగిపోయారు.ఇక ఈ వీడియోని చూసిన కొంతమంది నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.వామ్మో ఇలా ఉన్నారు ఏంటి అని కొంత మంది కామెంట్స్ చేస్తూ ఉంటే, మరికొందరు.
వివిధ రకాల ఎమోజిలతో కామెంట్స్ చేస్తున్నారు.మరికొందరైతే ఇలాంటి వారిపై పోలీసులు కచ్చితంగా చర్యలు చేపట్టాలని కామెంట్ చేస్తున్నారు.