ఐకాన్ సార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) అరెస్ట్ ( Arrest ) విషయం రెండు తెలుగు రాష్ట్రాలలోనూ అలాగే ఇండస్ట్రీలో కూడా పెద్ద ఎత్తున చర్చలకు కారణం అవుతుంది.అల్లు అర్జున్ అరెస్ట్ కావడంతో ఎంతోమంది ఈయన అరెస్టును పూర్తిగా తప్పుపడుతున్నారు.
ఇలాంటి తరుణంలోనే వేణు స్వామి కూడా అల్లు అర్జున్ గురించి ఒక ఇంటర్వ్యూ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇలా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి వేణు స్వామి ( Venu Swamy ) అల్లు అర్జున్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.
ఇటీవల కాలంలో అల్లు అర్జున్ రాజకీయాలలోకి రావాలనుకుంటున్నారని అందుకే ఈయన తన టీం తో కలిసే ప్రశాంత్ కిషోర్ ను కూడా కలిశారు అంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.ఇక ఈ విషయం గురించి అల్లు అర్జున్ టీం స్పందిస్తూ ఈ వార్తలను ఖండించారు.తాజాగా వేణు స్వామి మాట్లాడుతూ అల్లు అర్జున్ జాతకం ప్రకారం ఆయన కచ్చితంగా పార్టీ పెడతారని తెలిపారు.ఇలా 100% రాజకీయ పార్టీని స్థాపిస్తారని వేణు స్వామి వెల్లడించారు.
ఇలా రాజకీయ పార్టీ స్థాపించడమే కాకుండా ఆయన జాతకం ప్రకారం ముఖ్యమంత్రి కూడా అవుతారని ఈ సందర్భంగా వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.ఇటీవల కాలంలో జైలుకు వెళ్లి వచ్చిన వారందరూ కూడా ముఖ్యమంత్రులు అవుతున్నారు కాబట్టి అలా అల్లు అర్జున్ కూడా అరెస్టయి బయటకు రావడంతో ఈయన కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటూ ఈయన చేసిన వ్యాఖ్యలపై నేటిజన్స్ భారీ స్థాయిలో విమర్శలు వర్షం కురిపిస్తున్నారు.