రాష్ట్రంలో వైసీపీ( YCP ) అధికారంలో ఉన్న సమయంలో టికెట్ రేట్లకు సంబంధించి జరిగిన రచ్చ అంతాఇంతా కాదు.వైసీపీ సర్కార్ 5 రూపాయలకు, 20 రూపాయలకు సైతం టికెట్ రేట్లను విక్రయించేలా జీవో తీసుకురాగా ఇప్పుడు మాత్రం టికెట్ రేటుపై 150 రూపాయలు, 200 రూపాయలు పెరిగేలా జీవో అమలవుతోంది.
ఎన్టీఆర్ కు ( NTR ) చంద్రబాబుకు మధ్య గ్యాప్ ఉందని బన్నీకి( Bunny ) పవన్ కు గ్యాప్ ఉందని చాలామంది భావిస్తారు.
అయితే విచిత్రం ఏంటంటే దేవర( Devara ) సినిమా టికెట్ రేట్ల పెంపునకు చంద్రబాబు( Chandrababu ) సహాయం చేస్తే పుష్ప ది రూల్( Pushpa The Rule ) టికెట్ రేట్ల పెంపునకు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సహాయం చేశారు.
టికెట్ రేట్ల విషయంలో మాత్రం కూటమి వేరే లెవెల్ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.కూటమి సర్కార్ సినిమాలకు సంబంధించి మాత్రం ఎవరినీ ఇబ్బంది పెట్టే ఆలోచనతో అయితే లేదని తెలుస్తోంది.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో టికెట్ రేట్లు భారీగా ఉన్న నేపథ్యంలో ఏ రేంజ్ కలెక్షన్లు వస్తాయో చూడాల్సి ఉంది.పరిస్థితులు సైతం అనుకూలిస్తూ ఉండటం ఈ సినిమాకు మరింత ప్లస్ కానుంది.మెగా ఫ్యాన్స్ సైతం పుష్ప2 మూవీకి సపోర్ట్ చేస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.పుష్ప2 బాక్సాఫీస్ రేంజ్ గురించి మరికొన్ని గంటల్లో పూర్తిస్థాయిలో క్లారిటీ రానుంది.
పుష్ప ది రూల్ మూవీ రిలీజ్ తో థియేటర్లు మాత్రం ఊహించని విధంగా కళకళలాడుతున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.పుష్ప ది రూల్ మూవీ శాటిలైట్ హక్కులు స్టార్ మా సొంతం కాగా ఒకింత భారీ మొత్తానికి ఈ హక్కులు అమ్ముడయ్యాయని తెలుస్తోంది.పుష్ప ది రూల్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లతోనే 1000 కోట్ల మార్కును క్రాస్ చేస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.టాలీవుడ్ ఇండస్ట్రీ రేంజ్ రాబోయే రోజుల్లో మరింత పెరగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.