ఎన్టీఆర్ కు బాబు, బన్నీకి పవన్.. టికెట్ రేట్ల విషయంలో మాత్రం కూటమి వేరే లెవెల్!
TeluguStop.com
రాష్ట్రంలో వైసీపీ( YCP ) అధికారంలో ఉన్న సమయంలో టికెట్ రేట్లకు సంబంధించి జరిగిన రచ్చ అంతాఇంతా కాదు.
వైసీపీ సర్కార్ 5 రూపాయలకు, 20 రూపాయలకు సైతం టికెట్ రేట్లను విక్రయించేలా జీవో తీసుకురాగా ఇప్పుడు మాత్రం టికెట్ రేటుపై 150 రూపాయలు, 200 రూపాయలు పెరిగేలా జీవో అమలవుతోంది.
ఎన్టీఆర్ కు ( NTR ) చంద్రబాబుకు మధ్య గ్యాప్ ఉందని బన్నీకి( Bunny ) పవన్ కు గ్యాప్ ఉందని చాలామంది భావిస్తారు.
అయితే విచిత్రం ఏంటంటే దేవర( Devara ) సినిమా టికెట్ రేట్ల పెంపునకు చంద్రబాబు( Chandrababu ) సహాయం చేస్తే పుష్ప ది రూల్( Pushpa The Rule ) టికెట్ రేట్ల పెంపునకు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సహాయం చేశారు.
టికెట్ రేట్ల విషయంలో మాత్రం కూటమి వేరే లెవెల్ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
కూటమి సర్కార్ సినిమాలకు సంబంధించి మాత్రం ఎవరినీ ఇబ్బంది పెట్టే ఆలోచనతో అయితే లేదని తెలుస్తోంది.
"""/" /
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో టికెట్ రేట్లు భారీగా ఉన్న నేపథ్యంలో ఏ రేంజ్ కలెక్షన్లు వస్తాయో చూడాల్సి ఉంది.
పరిస్థితులు సైతం అనుకూలిస్తూ ఉండటం ఈ సినిమాకు మరింత ప్లస్ కానుంది.మెగా ఫ్యాన్స్ సైతం పుష్ప2 మూవీకి సపోర్ట్ చేస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
పుష్ప2 బాక్సాఫీస్ రేంజ్ గురించి మరికొన్ని గంటల్లో పూర్తిస్థాయిలో క్లారిటీ రానుంది. """/" /
పుష్ప ది రూల్ మూవీ రిలీజ్ తో థియేటర్లు మాత్రం ఊహించని విధంగా కళకళలాడుతున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
పుష్ప ది రూల్ మూవీ శాటిలైట్ హక్కులు స్టార్ మా సొంతం కాగా ఒకింత భారీ మొత్తానికి ఈ హక్కులు అమ్ముడయ్యాయని తెలుస్తోంది.
పుష్ప ది రూల్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లతోనే 1000 కోట్ల మార్కును క్రాస్ చేస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
టాలీవుడ్ ఇండస్ట్రీ రేంజ్ రాబోయే రోజుల్లో మరింత పెరగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
మళ్లీ ఆ వ్యవస్థను ప్రవేశపెట్టబోతున్న రేవంత్ ?