ప్రస్తుత రోజులలో సోషల్ మీడియా వినియోగం సర్వసాధారణం అయింది.ఈ క్రమంలో సోషల్ మీడియాలో(social media) ఫేమస్ అయ్యే కొరకు, ఇంకా భారీగా క్రేజ్ పెంచుకోవడానికి వివిధ రకాల రీల్స్(Reels) చేయడంతో పాటు వివిధ రకాల స్టంట్స్ కూడా చేస్తూ ఉంటారు.
ఇందులో కొంతమంది చేసే వీడియోలు చూస్తే ఇతరులకు ఇబ్బంది కలిగే వేసే విధంగా ఉంటే.మరికొన్ని మనుసును హత్తుకునేలా ఉంటాయి.
యువత ఎప్పటికప్పుడు స్టంట్స్ పేర్లతో ప్రమాదకరమైన విన్యాసాలు చేసి వారి ప్రాణాలను చిక్కులలో పెట్టడమే కాకుండా.ఇతరుల ప్రాణాలతో కూడా చెలగాటాలు ఆడుతూ ఉంటారు.
అచ్చం అలాగే తాజాగా ఒక వ్యక్తి కారుతో విచిత్రమైన ప్రయోగం చేసి చివరకు చిక్కులలో చిక్కుకున్నాడు.సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు లోకి వెళ్తే.
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని మీరట్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది.మందలి గ్రామానికి చెందిన ఇంతేజార్ అలీ అనే వ్యక్తి తన మహీంద్రా కార్(Mahindra Car) పై కప్పు పై ఓ పార సహాయంతో ఇసుకను నింపాడు.
ఆ తర్వాత అదే కారుతో రోడ్డుపై రాంగ్ రూట్లో అతివేగంగా ప్రయాణించడంతో గాలికి ఆ మట్టి పైకప్పు పైకి ఎగిరిపోయి రోడ్డుపై ప్రయాణించే వారికి ఆ మట్టి చాలా ఇబ్బందికరంగా మారింది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.
ఈ వైరల్ అవుతున్న వీడియోను చూసిన కొంతమంది నీటిజన్స్ వివిధ రకాలుగా స్పందించడంతోపాటు ఆ యువకుడు పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అతడి పై కఠిన చర్యలు తీసుకోవాలని కొంత మంది డిమాండ్ చేయగా.చివరకు సంఘటన విషయం పోలీసులకు చేరుకోవడంతో రంగంలోకి దిగారు.సీసీ ఫుటేజ్(CCTV footage) ఆధారంగా సదరు యువకుడిని మీరట్ పోలీసులు పట్టుకొని అతడికి 25 వేల రూపాయల జరిమానా కూడా విధించారు.
పోలీసులు ఆ యువకుడికి బుద్ధి చెప్పిన విధానానికి కొంతమంది మెచ్చుకుంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.