త్వరలో రైతులందరికీ రైతు భరోసా: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్లగొండ జిల్లా: త్వరలో రైతులందరికీ రైతు భరోసా డబ్బులను వారి ఖాతాలో జమ చేస్తామని రాష్ట్ర రోడ్లు,భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.గురువారం నల్లగొండలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా త్వరలో రైతు సభలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

 Rythu Bharosa For All Farmers Soon Minister Komatireddy Venkatareddy, Rythu Bhar-TeluguStop.com

డిసెంబర్ 7న బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు, నల్గొండలోని మెడికల్ కళాశాలకు సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.అనంతరం ఎన్జీ కళాశాలలో బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు.

బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు రిజర్వాయర్ ను ఇప్పటికే నింపడం జరిగిందని తెలిపారు.ఈ ప్రాజెక్టుతో చుట్టుపక్కల గ్రామాలలో భూగర్భ జలాలు పెరగడంతో పాటు సాగు ఆయకట్టు పెరుగుతుందన్నారు.

బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుతో 18 సంవత్సరాల తన చిరకాల వాంఛ నెరబొరబోతుందని అన్నారు.రైతు రుణమాఫీని కూడా పూర్తిస్థాయిలో రైతులకు చెల్లిస్తామని స్పష్టం చేశారు.నల్గొండ పట్టణంలో రూ.110 కోట్లతో స్పెషల్ డెవలప్మెంట్ కింద అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తోపాటు పలు అభివృద్ధి పనులు, రూ.40 కోట్లతో నర్సింగ్ కళాశాలకు శంకుస్థాపన,

రూ.275 కోట్లతో నిర్మించిన మెడికల్ కళాశాల భవనాన్ని సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు.అదేవిధంగా పాత టౌన్ హాల్లో కొత్తగా జిల్లా గ్రంథాలయంకు శంకుస్థాపన చేయడం జరుగుతుందని తెలిపారు.వీటితో పాటు రూ.100 కోట్లతో లతీఫ్ షాప్ దర్గా,బ్రహ్మంగారి గుట్ట ఘాట్ రోడ్డులకు శంకుస్థాపన చేయడానికి ఇప్పటికే ఆర్ అండ్ బి శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి ఎస్టిమేట్ వేయడం జరిగిందని వెల్లడించారు.వీలైతే వీటిని కూడా సీఎంతో శంకుస్థాపన చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమానికి మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డితో పాటు ఎంపీ,ఎమ్మెల్యేలు పాల్గొంటారని పేర్కొన్నారు.శుక్రవారం సీఎం పర్యటనకు సంబంధించి ఖచ్చితమైన తేదీని ప్రకటించి చెబుతానని పేర్కొన్నారు.

జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు అన్నిటిని కూడా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.మూసితో ఎక్కువ నష్టపోయేది, అనారోగ్యం పాలయ్యేది నల్లగొండ జిల్లా ప్రజలేనని అన్నారు.మూసి ప్రక్షాళనతో న్యాయం జరుగుతుందన్నారు.ఎస్ ఎల్ బి సి సొరంగ మార్గానికి సంబంధించి రెండు మిషన్లు త్వరలో జిల్లాకు చేరుకుంటాయని, 20 నెలల్లోనే సొరంగ మార్గాన్ని పూర్తి చేస్తామని అన్నారు.

దీంతో ఎంఆర్పితో పని లేకుండా నీళ్లు వస్తాయని తెలిపారు.దేశంలో ఎక్కడలేని విధంగా రూ 500 కే గ్యాస్ సిలిండర్ ఇచ్చిన ఘనత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని అదే విధంగా 200 యూనిట్ల కరెంటును కూడా ఉచితంగా ఇస్తున్నామని పేర్కొన్నారు.నెలకు రూ.300 కోట్లను భరిస్తూ మహిళకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని అన్నారు.ఇలాంటి సంక్షేమ పథకాలు బిజెపి అధికారాల్లో ఉన్న రాష్ట్రాలలో ఎక్కడ కూడా అమలు కావడం లేదన్నారు.దీనికి ప్రధాని మోడీ సమాధానం చెప్పాలన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 11 నెలలు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిందన్నారు.కెసిఆర్ తెలంగాణను అప్పులపాలు చేయగా వాటిని భరిస్తూ పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ముందుకు పోతుంటే మోడీ విమర్శించడం శోచనీయమన్నారు.రూ.30 వేల కోట్లతో చేపట్టబోయే రీజినల్ రింగ్ రోడ్డు శంకుస్థాపనకు ప్రధాని మోడీ,కేంద్రమంత్రి గట్కర్ని కూడా కలిసి ఆహ్వానించడం జరుగుతుందని తెలిపారు.అభివృద్ధి, నిధుల కోసం కేంద్ర మంత్రులను కలవడం జరుగుతుందని వెల్లడించారు.హైదరాబాద్-విజయవాడ రోడ్డును కేంద్రమంత్రి గట్కరితో చర్చించి ఫైనల్ చేయడం జరుగుతుందన్నారు.

నల్గొండ రీజినల్ రింగ్ రోడ్డుకు సంబంధించి టెండర్లు పిలవడం జరిగిందని,అవి కూడా త్వరలో పనులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.బిఆర్ఎస్ పార్టీలో ప్రతిపక్ష నాయకుడు ఎవరో చెప్తే వారు మాట్లాడితే తాను సమాధానం చెప్తానని, కెసిఆర్ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తానని ఏడు లక్షల కోట్లు అప్పు చేసి ఫామ్ హౌస్ లో పండుకున్నాడని విమర్శించారు.

అల్లుడు హరీష్ రావు,కొడుకు కేటీఆర్ గురుకులాల గురించి మాట్లాడితే తాను సమాధానం చెప్పనని, వాళ్లు నా స్థాయి కాదన్నారు.దమ్ముంటే కేసీఆర్ వచ్చి మాట్లాడాలన్నారు.

ఈ విలేకరుల సమావేశ నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి,వైస్ చైర్మన్ అబ్బుగోని రమేష్ గౌడ్,నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, నల్గొండ మాజీ జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య కనగల్ మాజీ జెడ్పిటిసి నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్,పలువురు కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube