ఏం తెలివి గురూ.. ఎన్విడియా సీఈఓ తన భార్యను ఇలానే ప్రేమలో పడేశాడట..!

పాపులర్ కంపెనీ ఎన్విడియాకి సీఈఓగా ఉన్న జెన్సన్ హువాంగ్( Jensen Huang ) తన లవ్ స్టోరీ గురించి పంచుకున్నారు.తన కాలేజీ రోజుల్లో తన భార్య లోరీ హువాంగ్‌ను ఎలా ఆకట్టుకున్నారో తెలియజేశారు.

 What A Wise Guru Nvidia Ceo Fell In Love With His Wife Like This, Jensen Huang,-TeluguStop.com

హాంకాంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తన భార్యను ఇంప్రెస్ చేయడానికి ఒక ప్రత్యేకమైన మార్గాన్ని ఎంచుకున్నారని తెలిపారు.

జెన్సన్, లోరీ ఇద్దరూ ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు పరిచయమయ్యారు.

ఆ సమయంలో జెన్సన్‌కు 17 ఏళ్లు, లోరీకి( Lori ) 19 ఏళ్లు.తన చిన్న వయస్సును చూసి లోరీ తనను తెలివైన వాడిగా భావిస్తుందని అనుకుని, ఆమెను ఆకట్టుకోవడానికి ఒక వినూతనమైన ప్రయత్నం చేశారు.

లోరీ వద్దకు వెళ్లి, “నా హోంవర్క్ చూడాలనుకుంటున్నావా?” అని అడిగారు.ఆ తర్వాత ఆమెకు ఒక ఆసక్తికరమైన ఆఫర్ ఇచ్చారు.“ప్రతి ఆదివారం నాతో కలిసి హోంవర్క్ చేస్తే, నీకు అన్ని సబ్జెక్టుల్లో ఎ గ్రేడ్స్ వస్తాయని నేను మాటిస్తున్నాను.” లోరీ ముందు షో ఆఫ్ చేశారు జెన్సన్.

Telugu Ceo Love Story, Entrepreneur, Jensen Huang, Lori Huang, Nri, Nvidia, Oreg

జెన్సన్ చేసిన ఈ వినూత్న, తెలివైన ఐడియా వర్కౌట్ అయ్యింది.లోరీ అతని ప్రతిపాదనకు ఒప్పుకుంది.అప్పటి నుంచి వారు ప్రతి ఆదివారం కలిసి స్టడీ చేస్తూ గడిపారు.ఈ సమయంలో జెన్సన్ ధైర్యంగా లోరీతో, తను 30 ఏళ్ల వయసులో సీఈఓ అవుతానని చెప్పాడు.

సంవత్సరాల తర్వాత ఆయన ఆ అంచనాను నిజం చేసి, లోరీపై మరింత ప్రభావం చూపించాడు.ఒరెగాన్ స్టేట్‌లో కలిసిన ఐదేళ్ల తర్వాత వీరి వివాహం జరిగింది.

Telugu Ceo Love Story, Entrepreneur, Jensen Huang, Lori Huang, Nri, Nvidia, Oreg

జెన్సన్, లోరీకి ఇద్దరు పిల్లలు.వారి కూతురు మాడిసన్( Madison ) ప్రస్తుతం ఎన్విడియాలో మార్కెటింగ్ డైరెక్టర్‌గా, కుమారుడు స్పెన్సర్ సీనియర్ ప్రొడక్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.ఎన్విడియాను స్థాపించిన జెన్సన్ తైవాన్‌లో జన్మించారు.తన తొమ్మిదవ ఏట అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు.ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేసి, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు.30వ ఏట అయిన 1993లో, జెన్సన్ ఎన్విడియా కంపెనీని స్థాపించారు.ప్రస్తుతం ఎన్విడియా కంపెనీ అత్యాధునిక గ్రాఫిక్స్ ప్రాసెసర్లు (GPUs), సిస్టమ్ ఆన్ చిప్స్ (SoCs), సంబంధిత సాఫ్ట్‌వేర్లను రూపొందిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube