ప్రముఖ సినీనటి ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) మాజీ భార్య అయినటువంటి రేణు దేశాయ్( Renu Desai ) తల్లి ఇటీవల మరణించిన విషయం మనకు తెలిసిందే.పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన ఈమె ప్రస్తుతం తన పిల్లల బాధ్యతలను చూసుకుంటూ ఉన్నారు అలాగే సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు.
ఇక రేణు దేశాయ్ తల్లిగారు( Renu Desai Mother ) మరణించడంతో ఈమె సోషల్ మీడియా వేదికగా తన తల్లి గురించి ఎమోషనల్ పోస్ట్ చేస్తూ తన తల్లి మరణ విషయాన్ని వెల్లడించారు.ఈ క్రమంలోనే ఎంతోమంది అభిమానులు స్నేహితులు సన్నిహితులు కూడా ఈమెకు సానుభూతి తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు.
![Telugu Hindu Dharma, Pawan Kalyan, Renu Desai, Renudesai, Rest, Rip-Movie Telugu Hindu Dharma, Pawan Kalyan, Renu Desai, Renudesai, Rest, Rip-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/11/Renu-desai-instagram-post-goes-viral-on-social-media-detailsa.jpg)
సాధారణంగా మనం ఎవరైనా చనిపోతే వారి ఆత్మకు శాంతి కలగాలి అంటూ రిప్ అని పెడుతూ పోస్ట్లు చేస్తుంటాము.ఇక రేణు దేశాయ్ తల్లి చనిపోయిన కూడా తన స్నేహితులు అలాగే సన్నిహితులు ఇలాంటి పోస్టులే చేశారని ఈమె తెలిపారు.దయచేసి ఎవరూ కూడా చనిపోయిన వారికి రిప్ అని చెప్పకండి అంటూ రేణు దేశాయ్ ఈ సందర్భంగా వెల్లడించారు.
![Telugu Hindu Dharma, Pawan Kalyan, Renu Desai, Renudesai, Rest, Rip-Movie Telugu Hindu Dharma, Pawan Kalyan, Renu Desai, Renudesai, Rest, Rip-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/11/Renu-desai-instagram-post-goes-viral-on-social-media-detailsd.jpg)
అలా రిప్, రెస్ట్ ఇన్ పీస్( Rest in Peace ) అని పెట్టకూడదు.హిందువులు చనిపోతే అలా రిప్ అని చెప్పకండి రిప్ అంటే ఆత్మకు విశ్రాంతి దొరకడం అని అర్థం.కానీ మన హిందూ ధర్మం ప్రకారం ఆత్మ ఎప్పుడూ ఒంటరిగా ఉండదు.
దానికి విశ్రాంతి దొరకదు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్న ఒక పండిట్ నుంచి రిప్, సద్గతి తేడా గురించి తెలుసుకున్నా.అయితే ఈ విషయాన్ని నేను నా ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ కి చెప్పాలని అనుకున్నాను అంతేకానీ ఎవరి నమ్మకాలను కించపరచాలనేది నా ఉద్దేశం కాదు అంటూ ఈ సందర్భంగా రేణు దేశాయ్ పోస్ట్ చేశారు.
ఇలా ఈమె సనాతన ధర్మం గురించి అంటూ మాట్లాడటంతో పవన్ అభిమానులు స్పందిస్తూ పవన్ కళ్యాణ్ నుంచి ఈమె విడిపోయిన వీరిద్దరి ఆలోచనలు ఒకటే అంటూ కామెంట్ చేస్తున్నారు.