టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ కనకాల( Suma Kanakala ) హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో సుమ అడ్డ.( Suma Adda ) ఈ షో కి బుల్లితెర అలాగే వెండితెర సెలబ్రిటీలు వస్తూ ఉంటారు.
అందులో భాగంగానే తాజాగా కూడా కొంతమంది సెలబ్రిటీలు ఈ షో కి హాజరయ్యారు.ఇందుకు సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు.
ఆ ప్రోమోలో జబర్దస్త్ అలాగే బిగ్ బాస్ కంటెస్టెంట్లు అయిన పల్లవి ప్రశాంత్,( Pallavi Prashanth ) భోలే షావలి,( Bhole Shavali ) దామిని, గీతూ రాయల్, ఫైమా, కీర్తి భట్ వచ్చారు.సుమ అడ్డాలో ఎప్పుడూ లేనిది ఈసారి మాత్రం గట్టిగానే గొడవయ్యింది.దాంతో సుమ కూడా షాక్ అయ్యింది.ఇక సుమ ఫస్ట్ రౌండ్ కోసం గెస్టులను కూర్చోబెట్టింది.
అయితే గీతూ, కీర్తి వచ్చి కూర్చున్నారు.దాంతో ఫైమా నువ్వు రాలేదేంటి అని అడిగింది సుమ.కీర్తి, గీతూ అనుకుని వెళ్లిపోయారు అని చెప్పింది.స్కిట్ చేసేటప్పుడు నన్ను కలుపుకున్నావా అని గీతూ అడిగింది.
దాంతో ఇద్దరి మధ్య గొడవయ్యింది.గట్టిగా అరవద్దు గీతూ( Geethu ) నువ్వు తోపువి అని ఫీల్ కాకుండా వెళ్లి ఆడు అని గట్టిగా ఇచ్చింది.
మధ్యలో బోలె షావలి వచ్చేసరికి నీ టీమ్ కాదుగా సైలెంట్ గా ఉండు అంటూ గీతూ వార్నింగ్ ఇచ్చింది.కీర్తి( Keerthi ) నువ్వు లే అని సుమ అనేసరికి అంటే నన్ను అవమానిస్తున్నారా అంటూ ఫీల్ అయ్యింది.
![Telugu Bhole Shavali, Damini, Faima, Geethu Royal, Geethuroyal, Rythubidda, Suma Telugu Bhole Shavali, Damini, Faima, Geethu Royal, Geethuroyal, Rythubidda, Suma](https://telugustop.com/wp-content/uploads/2024/11/Suma-Adda-Latest-Promo-video-viral-on-social-media-detailsd.jpg)
షో నుంచి వెళ్లిపొమ్మంటే వెళ్ళిపోతా నాకు అవసరం లేదు అని చెప్పింది గీతూ.బాబోయ్ ఏమి ఈగోలు రా నాయనా అంటూ సుమ తలపట్టుకుంది.పల్లవి ప్రశాంత్ కూడా గీతూ మీద కామెంట్స్ చేసేసరికి.బిగ్ బాస్ లో( Bigg Boss ) చేసిన గత్తరంతా ఇక్కడ నా ముందు చేయమాకా, ఇలాంటి కామెంట్స్ తీసుకోలేకపోతే షోకి ఇంకా రామాకు అని సీరియస్ గా చెప్పింది గీతూ.
ఇక పల్లవి ప్రశాంత్ అదే రాగం అందుకున్నాడు.
![Telugu Bhole Shavali, Damini, Faima, Geethu Royal, Geethuroyal, Rythubidda, Suma Telugu Bhole Shavali, Damini, Faima, Geethu Royal, Geethuroyal, Rythubidda, Suma](https://telugustop.com/wp-content/uploads/2024/11/Suma-Adda-Latest-Promo-video-viral-on-social-media-detailss.jpg)
మా నాయనా రైతు.నేను రైతు కొడుకును అని అన్నాడు.అప్పుడు గీతు మా నాయనా కలెక్టర్ అయ్యాడని నేను కలెక్టర్ ని కాలేనుగా అంటూ కౌంటర్ ఇచ్చింది గీతూ.
ఇందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఆ ప్రోమోని చూసిన నెటిజన్స్ ఇక చాలు ఆపండి ఇలాంటి ప్రోమోలు చాలానే చూసాము.
టిఆర్పి రేటింగ్ కోసం ఇలాంటివన్నీ చేయడం అవసరమా అంటూ మండిపడుతున్నారు.ఇంకొందరు ప్రోమో బాగానే వచ్చింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరి ఇది నిజమా లేకుంటే ఎప్పటిలాగే ప్రోమో కోసం ఇలా చేశారా అనేది తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే.