తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటులు చాలామంది ఉన్నారు.అందులో రామ్ చరణ్( Ram Charan ) ఒకరు.
ప్రస్తుతం ఈయన తనదైన రీతిలో సినిమాలు చేయడమే కాకుండా ప్రేక్షకుల మెప్పు పొందడానికి అహర్నిశలు ప్రయత్నం అయితే చేస్తున్నాడు.ఇక అందులో భాగంగానే ప్రస్తుతం ఆయన ‘గేమ్ చేంజర్ ‘( Game Changer ) అనే సినిమా చేశాడు.
ఈ సినిమా సంక్రాంతి కనుక గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపధ్యం లో ప్రస్తుతం ఆయన దీనికి సంబంధించి ప్రమోషన్స్ లో పాల్గొంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవడంలో రామ్ చరణ్ ముందు వరుసలో ఉన్నాడు.ఇప్పుడు సక్సెస్ అయితే ఆయన పేరు ఇండియాలో మరోసారి మారూమ్రోగిపోతుందనే చెప్పాలి.ఒకవేళ ఫ్లాప్ అయినా కూడా ఆయన ఇమేజ్ అయితే ఏ మాత్రం తగ్గదు ఈ సినిమా సక్సెస్ అనేది రామ్ చరణ్ కంటే కూడా శంకర్( Director Shankar ) కి చాలా కీలకంగా కాబోతుందనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది.
ఎందుకంటే ఇంతకుముందు ఆయన చేసిన భారతీయుడు 2( Bharateeyudu 2 ) సినిమా భారీ డిజాస్టర్ అవ్వడంతో ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా ఎలాగైనా సక్సెస్ సాధించాలి.
లేకపోతే మాత్రం ఆయనది ఐరన్ లెగ్ అంటూ చాలామంది అతన్ని విమర్శించే అవకాశాలు కూడా ఉన్నాయి.ఇక ఏది ఏమైనా కూడా మొదటి సారి తెలుగు హీరో తో శంకర్ స్ట్రైట్ తెలుగు సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే తెలుగులో ఆయనకు ఘన స్వాగతం అయితే పలుకుతారు.
లేకపోతే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావచ్చు…ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా సక్సెస్ అనేది శంకర్ కి చాలా కీలకమనే చెప్పాలి.