సీజన్ తో పని లేకుండా ఏడాది పొడవునా లభించే పండ్లలో అరటిపండు( Banana ) ముందు వరుసలో ఉంటుంది.ధర తక్కువే అయినా అరటి పండులో పోషకాలు మాత్రం చాలా అధికంగా ఉంటాయి.
ఇక రుచి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ అరటి పండ్లను ఎంతో ఇష్టంగా ఆరగిస్తుంటారు.
అయితే ప్రస్తుత చలికాలంలో( Winter ) అరటిపండు తినడం మంచిది కాదని కొందరు భావిస్తారు.కానీ అది కేవలం అపోహ మాత్రమే.
చలికాలంలో నిస్సందేహంగా అరటిపండును తినవచ్చు.
ప్రస్తుత ఈ సీజన్ లో సహజంగానే జీర్ణక్రియ పనితీరు నెమ్మదిస్తుంది.
దాంతో గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి.అయితే అరటిపండు తినడం వల్ల ఆయా సమస్యలకు దూరంగా ఉండవచ్చు.
అరటిపండు లోని ఫైబర్ కంటెంట్ జీర్ణ క్రియ కు( Digestion ) సహాయపడుతుంది.
అరటి పండ్లు పొటాషియం, కాల్షియం, మాంగనీస్, మెగ్నీషియం, ఐరన్, ఫోలేట్, నియాసిన్, రిబోఫ్లావిన్ మరియు బి6 వంటి అవసరమైన విటమిన్లు మరియు ఖనిజాలతో నిండి ఉంటాయి.ఇవి మీ శరీరం సక్రమంగా పని చేయడానికి, మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికి తోడ్పడతాయి.అరటి పండ్లలో ఉండే అధిక మినరల్ కంటెంట్ రోగనిరోధక శక్తిని( Immunity Power ) పెంపొందిస్తాయి.
అలాగే అరటిపండును తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడంత శక్తి చేకూరుతుంది.రోజంతా చాలా ఎనర్జిటిక్ గా ఉంటారు.అరటిపండ్లు ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మరియు వాపును తగ్గించడంలో సహాయపడతాయి.అరటి పండులో ఉండే పలు పోషకాలు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
అరటిపండు లో ఉండే పొటాషియం మరియు విటమిన్ ఎ మీ చర్మాన్ని మృదువుగా మెరిసేలా ప్రోత్సహిస్తాయి.ఇలా అరటి పండ్లతో అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ చలికాలంలో రాత్రిపూట మాత్రం వాటిని తినకూడదు.
అందులోనూ జలుబు, దగ్గు మరియు శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు నైట్ టైమ్ అరటి పండును దూరం పెట్టాలి.ఎందుకంటే, రాత్రివేళ అరటిపండు తింటే ఆయా సమస్యలు మరింత తీవ్రతరం అవుతాయి.