క్యారెట్( Carrot ) ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు.అలాగే చర్మ సౌందర్యాన్ని( Skin Care ) మెరుగుపరిచే సత్తా కూడా క్యారెట్ కు ఉంది.
క్యారెట్ ను ఇప్పుడు చెప్పబోయే విధంగా వాడితే మస్తు లాభాలు మీ సొంతం అవుతాయి.అందుకోసం ముందుగా ఒక చిన్న క్యారెట్ తీసుకుని పీల్ తొలగించి వాటర్ తో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ క్యారెట్ జ్యూస్ వేసుకోవాలి.అలాగే ఒక ఎగ్ వైట్, ( Egg White ) వన్ టీ స్పూన్ నీరు తొలగించిన పెరుగు,( Curd ) హాఫ్ టీ స్పూన్ ఆలివ్ ఆయిల్( Olive Oil ) వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి కాస్త మందంగా అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.
వారానికి రెండు సార్లు ఈ క్యారెట్ ఎగ్ మాస్క్( Carrot Egg Mask ) వేసుకోవడం వల్ల అదిరిపోయే బెనిఫిట్స్ ను పొందుతారు.ఆరోగ్యకరమైన చర్మాన్ని నిర్వహించడానికి ఈ మాస్క్ ఉత్తమంగా సహాయపడుతుంది.పొడి చర్మాన్ని నివారిస్తుంది.
చర్మం యవ్వనంగా మరియు నిగారింపుగా మెరిసేలా ప్రోత్సహిస్తుంది.అలాగే ఈ క్యారెట్ ఎగ్ మాస్క్ ను ప్రయత్నించడం వల్ల చర్మానికి చక్కని తేమ అందుతుంది.
స్కిన్ స్మూత్ గా మారుతుంది.మొండి మచ్చలు ఉంటే తగ్గు ముఖం పడతాయి.
అంతేకాకుండా ఈ మాస్క్ చర్మం యొక్క మృతకణాలు మరియు మలినాలను తొలగించడంలో సహాయపడుతుంది.చర్మం యొక్క టోన్ మరియు ఆకృతిని మెరుగుపరుస్తుంది.ఈ మాస్క్ తయారీలో వాడిన ఎగ్ వైట్ లో ప్రొటీన్ ఉంటుంది, ఇది చర్మాన్ని బిగుతుగా ఉంచుతుంది.మరియు పెద్ద రంధ్రాల రూపాన్ని సైతం తగ్గిస్తుంది.