పెరుగు( Curd ) లేనిదే భోజనం అసంపూర్ణం.ఎన్ని రకాల కూరలు, పచ్చళ్ళు, సాంబార్ తో భోజనం చేసినప్పటికీ.
చివర్లో కాస్తంత పెరుగన్నం తింటేనే తృప్తిగా అనిపిస్తుంది.అయితే సరైన అవగాహన లేకపోవడం వల్ల కొందరు ప్రస్తుత చలికాలంలో( Winter ) పెరుగును దూరం పెడుతుంటారు.
చలికాలంలో పెరుగు తినడం మంచిది కాదని భావిస్తారు.పెరుగు తింటే జలుబు, దగ్గు మరియు ఇతర శ్వాస కోస సమస్యలు తలెత్తుతాయని నమ్ముతారు.
కానీ నిజానికి చలికాలంలో పెరుగు మన ఆరోగ్యానికి రక్షణ కవచంలా ఉంటుంది.చలికాలంలో పెరుగు తినడం మానేయడం వల్ల మీరు అలా నష్టపోతున్నారు.
పెరుగులో ప్రోబయోటిక్స్, విటమిన్లు మరియు ప్రోటీన్లు ఉంటాయి.ఇవి మన రోగనిరోధక శక్తిని( Immunity Power ) బలోపేతం చేయడానికి తోడ్పడతాయి.ఫలితంగా సీజనల్ గా వచ్చే జబ్బులతో పోరాడటానికి తగిన సామర్థ్యం లభిస్తుంది.అలాగే పెరుగు శరీరం యొక్క పిహెచ్ బ్యాలెన్స్‌ను నిర్వహిస్తుంది.
ఆమ్లతను నివారించి జీర్ణక్రియను చురుగ్గా మారుస్తుంది.
పెరుగులో కేలరీలు తక్కువగా ఉంటాయి మరియు ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.అందువల్ల పెరుగు ఆకలి కోరికలను తగ్గిస్తుంది.బరువు తగ్గడానికి( Weight Loss ) మద్దతు ఇస్తుంది.
పెరుగులో కాల్షియం మరియు ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి, ఇవి ఎముకలు మరియు దంతాలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి.పెరుగులో విటమిన్ డి కూడా ఉంటుంది, ఇది శరీరం కాల్షియంను గ్రహించడంలో హెల్ప్ చేస్తుంది.
పెరుగులోని ప్రోబయోటిక్స్ ఆరోగ్యకరమైన గట్ నిర్వాహణకు తోడ్పడతాయి.అంతేకాదు.అంటువ్యాధులతో పోరాడటానికి, చర్మానికి పోషణ అందించడానికి, స్ట్రెస్ లెవల్స్ ను తగ్గడానికి పెరుగు గ్రేట్ గా సహాయపడుతుంది.ఇక చలికాలంలో పెరుగు తినొచ్చా? అంటే కచ్చితంగా తినొచ్చని నిపుణులు చెబుతున్నారు.కానీ పగటిపూట పెరుగును తీసుకోవడం మంచి ఎంపిక అవుతుంది.రాత్రి వేళ పెరుగును దూరం పెట్టడమే మంచిది.
అలాగే ఆస్తమా ఉన్నవారు మరియు ఇతర శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నవారు పెరుగు తినే ముందు వైద్యుల సలహా తీసుకోవాలి.