యాదాద్రిభువనగిరి జిల్లా:రాజపేట మండలం రఘునాథపురం గ్రామానికి చెందిన మజ్జిగ యాదగిరి (50) అనే రైతును అదే గ్రామానికి చెందిన వడ్లకొండ నాగరాజు అనే వ్యక్తి కర్రతో దాడి చేసి హత్య చేసినట్లు మృతిని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.గ్రామ శివారులో కర్రతో దాడి చేసి హత్యకు పాల్పడి పారిపోయిన నాగరాజును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
విషయం తెలుసుకున్న యాదగిరిగుట్ట ఏసిపి రమేష్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని
వివరాలు తెలుసుకున్నారు.దాడి చేస్తాడని మూడు రోజుల ముందే చెప్పినా పోలీసులు పట్టించుకోలేదని,పోలీస్ డౌన్ డౌన్ అంటూ కుటుంబ సభ్యులు నినాదాలు చేశారు.
హత్యపై గ్రామస్తులు, బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహంగా ఉండడంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.మృతుని కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటగా గ్రామంలో ఎలాంటీ అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పెద్ద ఎత్తున్న మోహరించారు.







