కోలీవుడ్ స్టార్ హీరో సూర్య( Surya ) తాజాగా నటించిన చిత్రం కంగువ.( Kanguva ) సూర్య కెరియర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాల్లో ఈ సినిమా కూడా ఒకటి.
ఈ మూవీని పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా శివ డైరెక్షన్లో తెరకెక్కించారు.అభిమానుల భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది.దాదాపు రూ.350 కోట్లకు పైగా బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు.మొదటి షో నుంచే కంగువకు పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు.
ఇప్పటికే ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీగా రెస్పాన్స్ వస్తోంది.ఆ సంగతి పక్కన పెడితే ఈ మూవీ ఓటీటీ రైట్స్‌కు సంబంధించి ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది.కంగువా ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్( Amazon Prime ) దక్కించుకున్నట్లు తెలుస్తోంది.దాదాపు రూ.100 కోట్లకు ఓటీటీ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది.మామూలుగా సినిమా విడుదలైన తర్వాత నెల రోజులకు ఓటీటీ వచ్చేస్తున్నాయి.కానీ కంగువా లాంటి భారీ బడ్జెట్ చిత్రాలకు మరింత సమయం పడుతుంది.
తాజా ఒప్పందం ప్రకారం విడుదలైన ఆరు వారాల తర్వాతే ఓటీటీకి రానుందని సమాచారం.అంటే ఈ ఏడాది డిసెంబర్ చివర్లో ఓటీటీ ప్రియులకు అందుబాటులోకి వచ్చే అవకాశముంది.ఇకపోతే ఈ సినిమాకు గాను సూర్య దాదాపు రూ.39 కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం థియేటర్లో సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శితం అవుతున్న ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది.