ఈ మధ్యకాలంలో చాలామంది ఫేమస్ కావడానికి సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటున్నారు.ఇందులో కొందరు డాన్సులు వేస్తూ, మరికొందరు జోకులు వేస్తూ, మరికొందరు భయభ్రాంతులకు గురి చేస్తూ ఫేమస్ కావడానికి ప్రయత్నం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ విచిత్రమైన కాస్ట్ ( strange cast )ను వేసుకొని ప్రజలను భయపెట్టేందుకు హాలోవీన్ థీమ్ ను వేసుకొని రోడ్డు పైకి వచ్చింది ఓ మహిళ.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
వీడియో సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.దేశ రాజధాని ఢిల్లీ నగరంలో( Delhi ) భయభ్రాంతులను గురి చేసే ఓ దయ్యం కాస్టమ్ వేసుకొని ఢిల్లీ రోడ్లపైకి వచ్చింది.అయితే ఆ మహిళా వేషం వేసింది మాత్రం పశ్చిమ్ విహార్‌కు చెందిన మేకప్ ఆర్టిస్ట్ షైఫాలీ నాగ్‌పాల్( Makeup artist Shaifali Nagpal ).అతను ఎర్రటి పెయింట్ వేసుకొని స్లీవ్ లెస్ తెల్లని దుస్తులను ధరించి అచ్చం దయ్యం లాగా కనిపించేలా దుస్తులు ధరించి నాగ్‌పాల్ స్థానిక పార్కు వద్దకు చేరుకున్నాడు.అయితే అక్కడ పిల్లలు ఆ రూపాన్ని చూసి కొందరు భయపడిపోయారు.ఆ తర్వాత అతను నడిరోడ్డు పైకి నడుచుకుంటూ వెళ్లడంతో పలువురు చూసి ఆశ్చర్యపోయారు.మరికొందరైతే ఫోటోలు కూడా దిగడానికి ఇష్టపడ్డారు.మరికొందరికి వీధిలో నడుచుకుంటూ వెళ్లేవారు వారిని చూసి నవ్వుకున్నారు కూడా.
ఇక వారు చేసిన పనికి కొందరు వారిని ప్రోత్సహించిన, మరికొందరేమో చేసింది తప్పు అంట విమర్శలు చేస్తున్నారు.
ఈ వీడియోకి ఇప్పటివరకు 7 లక్షల పైగా వ్యూస్ రాగా వేల సంఖ్యలో కామెంట్స్ లైక్స్ వస్తున్నాయి.ఈ వీడియో సంబంధించి రకరకాలుగా సోషల్ మీడియా నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.ఈ కల్చర్ భారతదేశానికి తీసుకురావాల్సిన అవసరం లేదంటూ కొందరు కామెంట్ చేస్తుండగా.
మరికొందరేమో బాగానే ట్రై చేశావ్ అంటూ కామెంట్ చేస్తున్నారు.