జుట్టు దట్టంగా ఉంటే మరింత అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తారు.అలాగే జుట్టు ఒత్తుగా ఉంటే రకరకాల హెయిర్ స్టైల్స్(Hair styles) వేసుకునేందుకు కూడా వీలుంటుంది.
అందుకే ప్రతి ఒక్కరూ దట్టమైన జుట్టును కోరుకుంటారు.అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పు పోయే పవర్ ఫుల్ సీరం అద్భుతంగా సహాయపడుతుంది.
వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఈ సీరం ను కనుక వాడితే రెండు నెలల్లో మీ జుట్టు దట్టంగా మారుతుంది.
సీరం తయారీ కోసం.
ముందుగా చిన్న ఉల్లిపాయ ని (Onion) తీసుకుని తొక్క తొలగించి వాటర్ తో కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.
వాటర్ హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు(Flax Seeds) వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ మెంతులు, ఐదు లవంగాలు(spoon fenugreek, five cloves) మరియు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి పదినిమిషాల పాటు ఉడికించాలి.
దాంతో మన సీరం అనేది రెడీ అవుతుంది.

స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో సీరంను ఫిల్టర్ చేసుకోవాలి.గోరువెచ్చగా అయిన తర్వాత తయారు చేసుకున్న సీరం ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి మసాజ్ చేసుకోవాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.
ఈ న్యాచురల్ సీరం (Natural serum)ను వాడటం అలవాటు చేసుకుంటే హెయిర్ గ్రోత్ అనేది చాలా అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది.మీ జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది.
హెయిర్ ఫాల్ సమస్య కంట్రోల్ అవుతుంది.

అలాగే ఈ సీరం జుట్టుకు చక్కని పోషణ అందిస్తుంది.సహజ మెరుపును జోడిస్తుంది.వెంట్రుకలు(Hair) విరగకుండా చిట్లకుండా ఈ సీరం(serum) కాపాడుతుంది.
కాబట్టి ఆరోగ్యమైన దట్టమైన జుట్టును కోరుకునే వారు తప్పకుండా ఈ పవర్ ఫుల్ సీరంను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.