టాలీవుడ్ హీరోయిన్ సాయి పల్లవి( Heroine Sai Pallavi ) గురించి మనందరికీ తెలిసిందే.ప్రస్తుతం సాయి పల్లవి తెలుగు తమిళం అని బాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది.
అందులో భాగంగానే ఇటీవలే శివ కార్తికేయన్ హీరోగా నటించిన అమరన్ ( Amaran )సినిమాలో హీరోయిన్గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.ఈ సినిమాతో మరో హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకుంది.
ప్రస్తుతం తెలుగులో నాగచైతన్య సరసన తండేల్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇకపోతే అందరి హీరోయిన్ల రూటు వేరు సాయి పల్లవి రూటు వేరని చెప్పడం అతిశయోక్తి కాదు.ఈ మాటను మరోసారి సాయి పల్లవి నిరూపించింది.కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటున్న చాలామంది హీరోయిన్లు తమకు తక్కువగా పారితోషికం ఇస్తున్నారని గగ్గోలు పెట్టడం మనం చూశాము.కానీ సాయి పల్లవి మాత్రం అందుకు భిన్నంగా ఒక సినిమా కోసం ఎంత గానో కష్టపడుతున్న అసిస్టెంట్ డైరెక్టర్స్( Assistant Directors ) కు తక్కువ రెమ్యునరేషన్ ఇస్తున్నారని అభిప్రాయపడ్డారు.
వారి కష్టానికి తగినంత పారితోషం ఇవ్వాలని ఆమె పేర్కొన్నారు.కాగా సాయి పల్లవి కోట్ల రూపాయలు ఇచ్చినా సరే ఎలాంటి యాడ్స్ చేయనని చెప్పేస్తారు.

కథకు అందులోని తన పాత్రకు ప్రాధాన్యత లేకపోతే అది ఎంత భారీ చిత్రం అయినా, స్టార్ దర్శకుడు, కథానాయకుడు అయినా నో చెప్పేస్తుంది.ఇకపోతే స్కిన్ షో అనే విషయాన్నే దరిదాపులకు కూడా రానివ్వరు.అసలు మేకప్ కు ప్రాముఖ్యతను కూడా ఇవ్వరు.అందుకే సహజ నటిగా పేరు తెచ్చుకున్నారు సాయి పల్లవి.ఇక విజయాల విషయానికి వస్తే.ఈమె ఇప్పటివరకు నటించిన అన్ని చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి.

ఇక అమరన్ చిత్రం లోని తన నటనకు దర్శకుడు మణిరత్నం( Directed Mani Ratnam ) వంటి వారే ప్రశంసల జల్లు కురిపించారు.ఇకపోతే సాయిపల్లవి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సహాయ దర్శకుల గురించి మాట్లాడారు.సహాయ దర్శకులకు వారి అర్హతకు తగిన వేతనాలు ఇవ్వడం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.బాలీవుడ్ తో పోలిస్తే వేతనాలు చాలా తక్కువ తీసుకుంటున్న దర్శకులు మన చిత్ర పరిశ్రమంలో ఉన్నారని ఆమె పేర్కొన్నారు.
బాలీవుడ్‌లో ఒక చిత్రాన్ని చేసిన సహాయ దర్శకుడు వెంటనే మరో చిత్రానికి పని చేయడానికి సిద్ధమవుతున్నారని, ఇది చాలా మంచి విషయమని అన్నారు.కానీ దక్షిణాదిలో పరిస్థితి వేరు అని సాయి పల్లవి పేర్కొన్నారు.
వారి శ్రమకు, అర్హత తగిన వేతనం లభించడం, లభించకపోవడం బాధ కలిగిస్తోందని సాయిపల్లవి తెలిపింది.ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.