పురుషుల్లో అధిక హెయిర్ ఫాల్ ను దూరం చేసే ఎఫెక్టివ్ రెమెడీ ఇది.. డోంట్ మిస్!

ఒత్తిడి, పోషకాల కొరత, ధూమపానం, ఆహారపు అలవాట్లు, కాలుష్యం, ప‌లు ర‌కాల మందుల వాడ‌కం, రెగ్యుల‌ర్ గా హెయిర్ వాష్ చేసుకోవ‌డం, త‌ల మీద ఫంగల్ ఇన్ఫెక్షన్లు తదితర కారణాల వల్ల కొందరు పురుషుల్లో హెయిర్ ఫాల్( Hair Fall ) అనేది చాలా అధికంగా ఉంటుంది.ఈ సమస్యను ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియక మదన పడుతున్నారా.? ప్రతి రోజు ఊడిపోయే జుట్టును చూస్తూ మరింత ఒత్తిడికి లోనవుతున్నారా.? అయితే ఇకపై మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు.ఇప్పుడు చెప్పబోయే ఎఫెక్టివ్ హోమ్ రెమెడీని పాటిస్తే సులభంగా అధిక హెయిర్ ఫాల్ సమస్యను దూరం చేసుకోవచ్చు.మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటో లేట్ చేయకుండా ఓ లుక్కేయండి.

 This Is An Effective Remedy For Excessive Hair Fall In Men Details, Men, Men Ha-TeluguStop.com
Telugu Amla Powder, Excessive Fall, Care Tips, Fall, Remedy, Care, Moringa Powde

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆమ్లా పౌడర్( Amla Powder ) వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ మునగాకు పొడి,( Moringa Powder ) వన్ టేబుల్ స్పూన్ వేపాకు పొడి( Neem Powder ) వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఆ తర్వాత సరిపడా బియ్యం నానబెట్టిన వాటర్ వేసుకుని కలుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

Telugu Amla Powder, Excessive Fall, Care Tips, Fall, Remedy, Care, Moringa Powde

వారానికి ఒక్కసారి ఈ విధంగా హెయిర్ మాస్క్ వేసుకుంటే మంచి లాభాలు పొందుతారు.ముఖ్యంగా ఉసిరి పొడి, మునగాకు పొడి, వేపాకు పొడి మరియు రైస్ వాటర్ జుట్టుకు చక్కని పోషణ అందిస్తాయి.కుదుళ్ల‌ను బ‌లంగా ఆరోగ్యంగా మారుస్తాయి.

జుట్టు రాలడాన్ని సమర్థవంతంగా అడ్డుకుంటాయి.అలాగే ఈ మాస్క్ జుట్టు ఎదుగుదలను ప్రోత్సహిస్తుంది.

తెల్ల జుట్టు త్వరగా దరిచేరకుండా అడ్డుక‌ట్ట వేస్తుంది.మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్ ను నివారించి స్కాల్ప్ ను ఆరోగ్యంగా సైతం మారుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube