టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr.NTR)గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
ఎన్టీఆర్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.అందులో భాగంగానే ఇటీవలే కొరటాల శివ దర్శకత్వం వహించిన దేవర మూవీతో ప్రేక్షకులను పలకరించారు.
ఈ సినిమాతో మరో హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నారు ఎన్టీఆర్.అయితే తారక్ (Tarak)కి ఆర్ఆర్ఆర్(RRR) తో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ దక్కడంతో ఇకమీదట పాన్ ఇండియా లెవెల్ లో ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాడు తారక్.
ఇకపోతే ఎన్టీఆర్ సినిమాల్లో విశేషాలు గురించి మాట్లాడుకోవాలి అంటే చాలానే ఉంటాయి.అందులో కొన్ని చిత్ర విచిత్రమైన సంఘటనలు ఉంటాయి.అందులో ఒకటి తాజాగా వైరల్ అవుతోంది.ఎన్టీఆర్ ఒక సందర్భంలో ఒక సినిమా సెట్ లో డైరెక్టర్(Director) మీద అలిగాడట.
ఈ సినిమా నేను చేయను.వెళ్ళిపోతాను అంటూ డైరెక్టర్ తో గొడవ కూడా పెట్టుకున్నాడట.
అయితే ఎన్టీఆర్ గొడవ పెట్టుకుంది బాల రామాయణం(Bala Ramayana) సినిమాకట.ఎన్టీఆర్ చిన్నప్పుడే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.
బాలరామాయణం సినిమాను గుణశేఖర్ డైరెక్ట్(director Gunasekhar) చేశాడు.
అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో అంతా చిన్నపిల్లలే కావడంతో ఒక్కరు కూడా కుదురుగా కూర్చొనేవారు కాదట.ఇక రాముడి పాత్రలో నటించిన ఎన్టీఆర్ అయితే అందరికంటే ఎక్కువ అల్లరే చేసేవారట.విపరీతమైన గోల చేశాడట.
అంతే కాదు చిన్నా పెద్దా అందరిని ఆటపట్టించేవాడట.యుద్ద సన్నివేశాల కోసం తెచ్చిన బాణాలు విరగొట్టాడట.
శివ ధనుర్భంగం సీన్ కోసం ప్రత్యేకంగా కనిపించాలని టేకుతో ఒక విల్లును తయారు చేయించారట డైరెక్టర్ గుణశేఖర్.అలాగే మరో డూప్లికేట్ విల్లును కూడా తయారు చేయించి పక్కన పెట్టారట.
అయితే ఒక వైపు షూటింగ్ పనులు జరుగుతుంటే మరోవైపు ఎన్టీఆర్ మిగతా పిల్లలతో కలిసి డూప్లికేట్ విల్లును పైకి లేపారట.ఆ తర్వాత టేకు విల్లును కూడా పైకి ఎత్తడానికి ప్రయత్నిస్తూ దానిని విరగొట్టారట.దీంతో డైరెక్టర్ గుణశేఖర్ తారక్ పై కోప్పడాడట.ఇక దర్శకుడు ఇలా కోపంతో తిట్టేవరకు ఎన్టీఆర్ అలిగాడట.ఇక నేను ఈ సినిమా చేయను.వెంటనే ఇంటికి వెళ్లిపోతాను అంటూ మారాం చేశాడట.