రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో వడ్లను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులు ఆందోళన చెందవద్దని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య బుధవారం తెలిపారు.ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఐకెపి కొనుగోలు కేంద్రంలో రైతులతో మాట్లాడి వడ్ల కొనుగోలు విషయంలో రైతులు అధైర్య పడవద్దు అన్నారు.
గత వారం రోజుల నుండి వడ్ల కొనుగోలులో కొంత జాప్యం జరిగిన మాట వాస్తవమేనని రైతులు సంయమనం పాటించాలన్నారు.ఇన్ని రోజులు రైస్ మిల్లర్లకు ప్రభుత్వానికి ఒప్పందం కుదరక ప్రతిష్టంభన ఏర్పడిందన్నారు.
ఇక నుండి ప్రభుత్వం కేటాయించిన పారా బాయిల్ రైస్ మిల్ కానీ రా రైస్ మిల్లు కానీ ధాన్యం సేకరణలో పూర్తిగా రైతులకు సహకరించడం జరుగుతుందన్నారు.
సన్న వడ్లు పండించిన రైతులు వడ్లను కొనుగోలు కేంద్రంలో తూకం వేయగానే మిల్లులకు తరలించడం జరుగుతుందన్నారు.
వారికి 500 రూపాయల బోనస్ ఇవ్వడంలో ఎలాంటి అనుమానం లేదన్నారు.రైతులు ఒకేసారి తూకం వేయడానికి ప్రయత్నించవద్దని కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు సహకరించాలన్నారు.రైతులు సంతోషంగా ఉంటేనే ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని వ్యాపార లావాదేవీలన్నీ సక్రమంగా జరుగుతాయన్నారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు గుండాటి రామ్ రెడ్డి, డైరెక్టర్ మిండేటి శ్రీనివాస్, బండారి బాల్ రెడ్డి,రైతులు ఐకెపి సెంటర్ నిర్వాహకులు ఉన్నారు.