సమగ్ర కుటుంబ సర్వేలో ప్రజలు భాగ్యస్వాములు కావాలి:కలెక్టర్

నల్లగొండ జిల్లా:సమగ్ర కుటుంబ సర్వేకై ఇండ్లకు వచ్చే ఎన్యుమరేటర్లకు ప్రజలు సహకరించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు.నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోని బిటిఎస్ కాలనీలో బుధవారం ప్రారంభమైన సామాజిక,ఆర్థిక,విద్య, ఉపాధి,రాజకీయ మరియు కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ను కలెక్టర్ తనిఖీ చేశారు.

 People Should Be Participants In Comprehensive Family Survey Collector, Partici-TeluguStop.com

అనంతరం మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ ఇంటింటి సర్వే సందర్భంగా సేకరించిన వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందని, ఎవరికీ సమాచారాన్ని వెల్లడి చేయడం జరగదని, అందువల్ల ప్రజలు వివరాలు ఇచ్చే విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.సర్వే కోసం వచ్చిన ఎన్యుమరేటర్లకు సరైన సమాచారాన్ని ఇచ్చి సహకరించాల్సిందిగా కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం సామాజిక,ఆర్థిక,విద్య, ఉపాధి,రాజకీయ,కుల పరమైన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నదని, అందువలన తప్పు సమాచారం ఇవ్వకుండా సరైన సమాచారాన్ని ఇస్తే భవిష్యత్తులో ఈ సమాచారం ఉపయోగపడేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.

ఇంటింటి సర్వే కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు శిక్షణ ఇవ్వడం జరిగిందని,ఈ నెల 6 నుండి 8 వరకు ఇండ్లను సందర్శించి ఇండ్ల జాబితాను రూపొందించడం జరుగుతుందని,అనంతరం సర్వేకు ప్రభుత్వం రూపొందించిన సుమారు 75 కాలాలో వివరాల సేకరణ చేపట్టడం జరుగుతుందని చెప్పారు.

ప్రజలు ఆధార్ కార్డు, రేషన్ కార్డు,ధరణి పట్టాదారు పాస్ బుక్ వంటివి సిద్ధంగా ఉంచుకుని ఎన్యుమరేటర్లకు అందుబాటులో ఉండి సమాచారం ఇచ్చి సహకరించాలని పునరుద్ఘాటించారు.సర్వే ఫారంలో ఎన్యుమరేటర్లు ఎట్టి పరిస్థితులలో తప్పులు నింపవద్దని, ఏవైనా సందేహాలు ఉంటే సూపర్వైజర్లు లేదా మున్సిపల్ కమిషనర్, ఎంపీడీవోలను సంప్రదించి నివృత్తి చేసుకోవాలన్నారు.

ఇండ్ల జాబితా తయారీ సందర్బంగా ఇంటిని సందర్శించినట్లుగా స్టిక్కర్ అతికించాలని చెప్పారు.సర్వే ఫారంలో పూర్తి వివరాలను నింపాలని, ప్రతి ఇంటికి వెళ్లి సేకరించిన డేటాను ఆన్లైన్ చేయడం జరుగుతుందని తెలిపారు.

జిల్లాలోని అందరు మున్సిపల్ కమిషనర్లు,ఎంపీడీవోలు సమగ్ర సర్వే విషయంపై విస్తృతంగా టామ్ టామ్ వేయించాలని ఆదేశాలు జారీ చేశారు.సమగ్ర సర్వేకు వివరాలు ఇచ్చేందుకు ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు.

మూడు స్థాయిల్లో సర్వేను పర్యవేక్షించడం జరుగుతుందని,ఇందుకు సూపర్వైజర్లు,మండల ప్రత్యేక అధికారి లేదా మున్సిపల్ కమిషనర్ , జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్ నోడల్ అధికారిగా నియమించడం జరిగిందని,అంతేకాక ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్, ఆకస్మికతనిఖీల ద్వారా కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నట్లు ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో నల్గొండ ఆర్డీవో అశోక్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ముసాబ్ అహ్మద్, ఎన్యుమరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube