మొటిమల నుంచి పొడి చర్మం వరకు కలబందతో ఎన్ని సమస్యలకు చెక్ పెట్టవచ్చో తెలుసా?

కలబంద( Aloe vera ).ఎన్నో ఔషధ గుణాలు ఉన్న మొక్క.

 Amazing Benefits With Aloe Vera For Skin! Aloe Vera, Aloe Vera Benefits, Aloe Ve-TeluguStop.com

ఇంగ్లీషులో అలోవెరా అని పిలవబడే కలబందను దాదాపు అందరూ తమ ఇంటి పెరట్లో పెంచుకుంటూ ఉంటారు.కలబంద ఆరోగ్యపరంగానే ఎన్నో ప్రయోజనాలను చేకూర్చడమే కాకుండా సౌందర్య సాధనంగా కూడా ఉపయోగపడుతుంది.

మొటిమల నుంచి పొడి చర్మం వరకు అనేక సమస్యలకు కలబంద చెక్ పెడుతుంది.మరి కలబందను ఏ సమస్యకు ఏ విధంగా వాడాలో తెలుసుకుందాం పదండి.

పొడి చర్మం తో బాధపడుతున్న వారు రెండు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్ ( Aloe vera gel )లో వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ ( Olive oil )మరియు వన్ టేబుల్ స్పూన్ తేనె( honey ) వేసుకుని బాగా మిక్స్ చేస్తే ఒక మంచి క్రీమ్ రెడీ అవుతుంది.ఈ క్రీమ్ ను రోజు నైట్ చర్మానికి అప్లై చేసుకుని నిద్రించాలి.

ఈ విధంగా చేయడం వల్ల డ్రై స్కిన్ సమస్య దూరం అవుతుంది.చర్మం తేమగా మృదువుగా మారుతుంది.

Telugu Aloe Vera, Benefitsaloe, Tips, Latest, Skin Care, Skin Care Tips-Telugu H

మొటిమల నివారణకు వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ లో పావు టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి( Cinnamon powder ), చిటికెడు పసుపు వేసి బాగా మిక్స్ చేయాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.రెగ్యులర్ గా ఇలా చేస్తే మొటిమలు, వాటి తాలూకు గుర్తులు పరార్ అవుతాయి.

Telugu Aloe Vera, Benefitsaloe, Tips, Latest, Skin Care, Skin Care Tips-Telugu H

డల్ స్కిన్ ను గ్లోయింగ్ గా మెరిపించుకోవాలని భావించేవారు రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్ లో వన్ టేబుల్ స్పూన్ చందనం పొడి, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసి మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసుకోవాలి.ప‌దిహేను నిమిషాలు అనంతరం మాస్క్ ను తొలగించాలి.వారానికి రెండు సార్లు ఈ మాస్క్ వేసుకుంటే చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.స్కిన్ కలర్ సైతం ఇంప్రూవ్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube