స్టార్ హీరో ప్రభాస్ ( Prabhas )టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ప్రభాస్ సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉండగా ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే.
అయితే ప్రభాస్ కుకింగ్ ( cooking ) కూడా చేస్తారని చాలా మందికి మాత్రమే తెలుసు.ప్రభాస్ ఫుడ్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారని అందరికీ తెలుసు.
తనతో పాటు తన చుట్టుపక్కల ఉండేవాళ్లకు మంచి ఆహారం అందేలా ప్రభాస్ జాగ్రత్త వహిస్తారు.
అయితే ప్రభాస్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఛీజ్ ఆమ్లేట్, కాఫీ, ఇల్లాచి టీ, అప్పడాలు చేస్తానని చెప్పారు.ఇవి సులువైన వంటకాలే అయినా ప్రభాస్ కుక్ చేశాడంటే ఈ వంటకాలు అభిమానులకు ఎంతో ప్రత్యేకం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.బాహుబలిలో ఉన్న ఈ టాలెంట్ గురించి తెలిసి నెటిజన్లు సైతం ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు.
ప్రభాస్ టాలెంట్ వేరే లెవెల్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ప్రభాస్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ప్రభాస్ ఇతర భాషల్లో సైతం ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించాలని మరిన్ని రికార్డులను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.ప్రభాస్ కల్కి హిందీలో రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించింది.
ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న ది రాజాసాబ్( The RajaSaab ) 2025 సంవత్సరం సమ్మర్ కానుకగా విడుదల కానుంది.ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా బిజీ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ప్రభాస్ కెరీర్ ప్లాన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో ప్రభాస్ కు ఎవరూ సాటిరారని చెప్పవచ్చు.ప్రభాస్ లుక్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతుండటం గమనార్హం.