ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది భారీ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుంది.మరి ఇలాంటి క్రమంలోనే యంగ్ హీరోలు సైతం వరుసగా సినిమాలు చేస్తూ సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నారు.
ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్ళు చేస్తున్న సినిమాల పట్ల సగటు ప్రేక్షకులలో కూడా మంచి అంచనాలైతే ఉంటున్నాయి.మరి దానికి అనుగుణంగానే వాళ్లు ఎలాంటి సినిమాలు చేయాలి అనేదాన్ని దృష్టిలో పెట్టుకొని మరి మంచి సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఏది ఏమైనా కూడా తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలనే ఉద్దేశ్యం లో చాలామంది దర్శకులు ప్రయత్నం చేస్తున్నట్టుగానే తెలుస్తోంది.

ఇక యంగ్ హీరోలు కూడా వాళ్ళని వాళ్ళు ఎలివేట్ చేసుకునే ప్రక్రియలో బిజీగా ఉన్నారు.ఇక ఏది ఏమైనా కూడా వాళ్లను వాళ్ళు స్టార్లుగా మలుచుకుంటే మాత్రం యంగ్ హీరోలకు మంచి గుర్తింపు అయితే లభిస్తుంది.ఇక రీసెంట్ గా కిరణ్ అబ్బవరం( Kiran Abbavaram ) చేస్తున్న క సినిమాకు( KA Movie ) సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది.
అయితే ఈ ట్రైలర్ లో కిరణ్ అబ్బవరం చాలా కొత్తగా కనిపిస్తున్నాడు.నిజానికి ఆయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉంటున్నాయి.

కానీ ఆ సినిమా అంచనాలకు తగ్గట్టుగా ఆడకపోవడంతో ఇంతకుముందు గతంలో వచ్చిన ఆయన సినిమాలు భారీగా ఫ్లాప్ అయ్యాయి.దాంతో ఇప్పుడు ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని సాధించాలని పాన్ ఇండియా( Pan India ) సినిమా చేస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.మరి ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.ఒకవేళ పాన్ ఇండియాలో మంచి మార్కెట్ క్రియేట్ చేసుకోగలిగితే మాత్రం ఆయనకి భారీ రెమ్యూనరేషన్ పెరిగే అవకాశాలైతే ఉన్నాయి.
మరి ఈ సినిమాతో తనను తాను ఎలా ఎలివేట్ చేసుకుంటాడు అనేది కూడా తెలియాల్సి ఉంది…








