సినీనటి శోభిత ( Sobhita ) ధూళిపాళ్ళ త్వరలోనే అక్కినేని ఇంటి కోడలుగా అడుగు పెట్టబోతున్న సంగతి తెలిసిందే.ఈమె నటుడు నాగచైతన్యతో ( Nagachaitanya ) ఇప్పటికే నిశ్చితార్థం జరుపుకున్నారు.
ఇక త్వరలోనే వీరి వివాహం కూడా జరగబోతోంది అని తెలుస్తుంది.నాగచైతన్య సమంత( Samantha ) కు విడాకులు ఇచ్చిన తర్వాత శోభిత నాగచైతన్య ఇద్దరు ప్రేమలో పడ్డారు ఇన్ని రోజులపాటు వీరి రిలేషన్ సీక్రెట్ గా ఉంచిన శోభిత ఏకంగా నిశ్చితార్థంతో తమ మధ్య ప్రేమ విషయాన్ని రివిల్ చేశారు.
ఆగస్టు నెలలో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.
![Telugu Naga Chaitanya, Nagarjuna, Sobhita, Sobhitawear, Sree Lakshmi-Movie Telugu Naga Chaitanya, Nagarjuna, Sobhita, Sobhitawear, Sree Lakshmi-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/10/Sobhita-wear-her-mother-in-law-saree-in-her-pre-wedding-celebrationsc.jpg)
ఇక వీరి వివాహం ఎప్పుడు ఎక్కడ అనే విషయాల గురించి ఎలాంటి అధికారిక సమాచారం లేదు కానీ శోభిత ఇంట్లో మాత్రం పెళ్లి వేడుకలు మొదలయ్యాయని ఇటీవల ఆమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫోటోలు చూస్తేనే అర్థమవుతుంది.ఈ ఫోటోలలో భాగంగా ఈమె పసుపు దంచే కార్యక్రమాన్ని నిర్వహించారు.సాంప్రదాయబద్ధంగా ఈ వేడుక పూర్తి అయింది.
ఇక శోభిత కూడా చీర కట్టుకొని అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపించారు.
![Telugu Naga Chaitanya, Nagarjuna, Sobhita, Sobhitawear, Sree Lakshmi-Movie Telugu Naga Chaitanya, Nagarjuna, Sobhita, Sobhitawear, Sree Lakshmi-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/10/Sobhita-wear-her-mother-in-law-saree-in-her-pre-wedding-celebrationsf.jpg)
ఇక ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా ఈ ఫోటోలలో శోభిత కట్టుకున్న చీర నాగార్జునకు చాలా కోపం తెప్పించింది అంటూ ఒక వార్త వైరల్ అవుతుంది.ఈ చీర నాగార్జున మాజీ భార్య నాగచైతన్య తల్లి శ్రీలక్ష్మికి ( Sri Lakshmi )చెందినదని కామెంట్ రూపంలో శోభిత తెలిపారు.లక్ష్మీ తనకు కాబోయే కోడలి కోసం తన చీర నగలు ఇచ్చారని ఈ విషయంలో నాగార్జున కోపంగా ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి.
కానీ ఎంతవరకు నిజం ఉందనేది మాత్రం తెలియదు.ఇక గతంలో కూడా నాగచైతన్య సమంతను పెళ్లి చేసుకున్నప్పుడు దగ్గుబాటి లక్ష్మి తల్లి రామానాయుడు గారి భార్య పెళ్లి చీర అలాగే నగలను సమంత తన పెళ్లిలో వేసుకుందంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి.
అయితే విడాకుల తర్వాత సమంత నాగచైతన్యకు తన అమ్మమ్మ వస్తువులన్నింటిని వెనక్కి తిరిగి ఇచ్చిందని తెలుస్తోంది.