ఇటీవల కాలంలో భారతదేశంలో ప్రేమ వివాహాలు(Love marriages) ఎక్కువవుతున్నాయి.చాలామంది తమకు నచ్చిన వ్యక్తితోనే జీవితం గడపాలని కోరుకుంటున్నారు.
కానీ, ఈ తొందరపాటులో కొంతమంది జీవితంలోని ముఖ్యమైన అంశాలను పక్కన పెడుతున్నారు.ముఖ్యంగా తల్లిదండ్రులను పక్కన పెట్టేస్తున్నారు తమ సంతోషమే ముఖ్యమని భావిస్తున్నారు ఇటీవల యువతి కూడా అలాగే తల్లి మాట కాదని ఒక యువకుడిని పెళ్లి చేస్తుంది.
ఆ వీడియో సోషల్ మీడియాలో(Social Media) తెగ వైరల్ అవుతోంది.ఆ వీడియోలో ఒక యువ జంట పెళ్లి చేసుకుంటున్నారు.
పూల మాలను మార్చుకున్న తర్వాత, అమ్మాయిని ఆమె తల్లి బ్యాట్‌తో(bat) కొట్టింది.అనుకో ఆ ప్రేమ వివాహం నచ్చలేదు అందుకే బ్యాట్‌తో బలంగా కొట్టింది.
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.ఆ వీడియోని ‘ఘర్ కే కాలేష్’ అనే ఖాతాలో పోస్ట్ చేశారు.ఈ వీడియోలో ఒక గ్రామంలో జరుగుతున్న పెళ్లి వేడుకను చూడవచ్చు.ఇది చాలా సింపుల్ గా జరుగుతోంది.పెళ్లిలో వరుడు వధూవరులు ఇరువురి మెడలో మాల వేస్తున్న సమయంలో, వధువు తల్లి క్రికెట్ బ్యాట్‌తో వధువును కొడుతుంది.ఈ దృశ్యం చూసిన వారందరూ షాక్‌కు గురయ్యారు.
ఈ వీడియో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ, ఇది సోషల్ మీడియాలో చాలా చర్చకు దారితీసింది.ఈ వీడియో చూస్తే, ఆ పెళ్లికి ముందు ఏదో గొడవ జరిగినట్లు అర్థమవుతోంది.
బహుశా, ఆ అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేయబోతున్నట్లు అనిపిస్తుంది.
2024, అక్టోబర్ 18న పోస్ట్ చేసిన ఆ వీడియోని ఇప్పటికే 3 లక్షలకు పైగా మంది లైక్ చేశారు.ఆ వీడియో కింద చాలా ఫన్నీ కామెంట్లు చేశారు.కొంతమంది అమ్మాయి తల్లిని క్రికెట్ జట్టులో చేర్చాలని, ఆమె బ్యాట్‌తో చాలా బాగా కొడుతుందని హిలేరియస్ కామెంట్లు చేశారు.
మరికొందరు అమ్మాయి తల్లి ఆశీర్వాదం ఇచ్చే తీరు చాలా ఫన్నీగా ఉందని సరదాగా అన్నారు.మరికొందరు మాత్రం, కొన్నేళ్ల తర్వాత ఆ అమ్మాయికి తన తల్లి చేసిన పని అర్థమవుతుందని చెప్పారు.
ఈ వీడియో చూసిన చాలామంది ఈ సంఘటనపై తమదైన శైలిలో సరదాగా కామెంట్లు చేస్తున్నారు.