మహర్షి వాల్మీకి జయంతి( Maharshi Valmiki Jayanti ) సందర్భంగా ఈ రోజు 17వ పోలీస్ బెటాలియన్ సర్దాపూర్ బెటాలియన్ లో అసిస్టెంట్ కమాండెంట్ సిహెచ్.సాంబశివరావు మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అసిస్టెంట్ కమాండెంట్ సిహెచ్.సాంబశివరావు మట్లాడుతూ వాల్మీకి రామాయణం( Ramayana ) రచించిన గొప్ప రచయిత, మహర్షి సాంప్రదాయ హిందూ క్యాలెండర్ ప్రకారం , వాల్మీకి జయంతిని అశ్విన్ మాసంలో పూర్ణిమ తిథి (పౌర్ణమి రోజు) జరుపుకుంటారు, అయితే గ్రెగోరియన్ క్యాలెండర్‌లో ఇది సెప్టెంబర్-అక్టోబర్ నెలకు అనుగుణంగా ఉంటుంది.
ఈ రోజు రామాయణ మహాకావ్యం చదువుతున్నాం అంటే దానికి కారణం వాల్మీకి మహర్షి .మహర్షి వాల్మీకి గొప్ప హిందూ ఇతిహాసం రామాయణం యొక్క రచయిత, ‘ఆది కవి’ లేదా సంస్కృత సాహిత్యం యొక్క మొదటి కవిగా కూడా గౌరవించబడ్డారు.రామాయణం, రాముడి కథను వర్ణించే అతను మొదట సంస్కృత భాషలో వ్రాసాడు మరియు 24,000 శ్లోకాలను 7 ‘కాండలు’ (కాంటోలు)గా విభజించారు.వాల్మీకి జయంతి ఈ ప్రశంసలు పొందిన సాధువు గౌరవార్థం జరుపుకుంటారు.
ఈ రోజును భారతదేశంలోని ఉత్తర ప్రాంతాలలో అంకితభావంతో జరుపుకుంటారు మరియు దీనిని ‘ప్రగత్ దివస్’ అని కూడా పిలుస్తారు.
రామాయణంలో మానవ ధర్మాలన్నిటి గురించి వాల్మీకి చక్కగా విశదపరచాడు.
శిష్య ధర్మం, భాతృ ధర్మం, రాజ ధర్మం, పుత్ర ధర్మం, భృత్యు ధర్మం, ఇంకా పతివ్రతా ధర్మాలు, ప్రేమలూ, బంధాలు, శరణాగత వత్సలత, యుద్ధనీతి, రాజనీతి, ప్రజాభ్యుదయం, సత్యవాక్య పరిపాలన, ఉపాసనా రహస్యాలు, సంభాషణా చతురత, జీవితం విలువ, ధర్మాచరణ మున్నగు అనేక రకాల ఉపదేశాలున్నాయి.ఒక్క మాటలో చెప్పాలంటే రామాయణ కావ్యంలో మంచి చెడుల గురించి చెప్పనిదంటూ ఏదీ లేదు.
ఇంత విలువైన సత్యాలను చెప్పి, ఇంతటి మహత్తర కావ్యాన్ని అందించిన కవి వాల్మీకి మహర్షి వందనీయుడు.ఆయనకు మనం చేతులెత్తి నమస్క రించాలి.ప్రతివారు, రామాయణ కావ్యం చదివి చక్కని గుణవంతులై శ్రీరాముని అనుగ్రహం పొందితే, వాల్మీకి మహర్షి ఋణం తీర్చుకున్నట్లే అని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ ఉదయభాస్కర్ , అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీమతి ప్రమీల,అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.