నా కాపురంలో చిచ్చు పెట్టాలని చూడకండి.. బాలయ్య సంచలన వ్యాఖ్యలు!

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న బాలకృష్ణ ( Balakrishna) ప్రస్తుతం యువ హీరోలకు పోటీ ఇస్తూ వరుస సినిమాలలో నటిస్తున్నారు.ఇలా ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాజకీయాలలో కూడా బాలయ్య ఎంతో చలాకీగా ఉంటున్నారు.

 Balakrishna Sensational Comments On His Wife Vasundhara ,vadundhara, Balakrishna-TeluguStop.com

ఇక ఇటీవల కాలంలో బాలకృష్ణ ఎన్నో సంస్థలను ప్రమోట్ చేస్తూ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటమే కాకుండా పలు షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్నారు.తాజాగా ఈయన ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా సందడి చేశారు.

Telugu Balakrishna, Bobby, Nbk, Sarees, Mall, Tollywood, Vadundhara-Movie

ఈ షాపింగ్ మాల్ ( Shopping mall ) ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం బాలకృష్ణ ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా మీడియా వారు బాలయ్యను వివిధ రకాల ప్రశ్నలు వేశారు.ఇందులో భాగంగా ఓ రిపోర్టర్ బాలకృష్ణను ప్రశ్నిస్తూ మీరెప్పుడన్నా మీ భార్య కోసం ఒక చీర( Saree ) అయినా కొన్నారా అంటూ ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు బాలయ్య సమాధానం చెబుతూ.

Telugu Balakrishna, Bobby, Nbk, Sarees, Mall, Tollywood, Vadundhara-Movie

మీరు ఇలాంటి ప్రశ్నలు అడిగి ఇప్పుడు నాకు నా భార్యకు మధ్య గొడవలు సృష్టించి మాకు కాపురంలో చిచ్చు పెడదామనుకుంటున్నారా అంటూ సరదాగా నవ్వేశారు.ఇలా బాలకృష్ణ మాట్లాడటంతో అక్కడున్న వారందరూ కూడా బాలయ్య మాటలకు ఒక్కసారిగా నవ్వారు.ఇక బాలకృష్ణ వసుంధర (Vasundhara) ఇద్దరు చాలా అన్యాయంగా ఉంటారనే విషయం మనకు తెలిసిందే.

బాలయ్య సినిమాలు రాజకీయాలు అంటూ బిజీగా ఉన్న నేపథ్యంలో ఈమె తన కుటుంబ వ్యవహారాలను పిల్లల బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తూ బాలయ్య విజయానికి కారణమయ్యారని చెప్పాలి.ఇక బాలకృష్ణ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈయన డైరెక్టర్ బాబి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా ప్రస్తుతం NBK 109 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube