నెలకి లక్షన్నర సేవ్ చేస్తున్న కపుల్.. కానీ నచ్చిన ఇల్లు కొనలేని దుస్థితి..?

ఇటీవల ముత్తుకృష్ణ అనే ఓ ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్ తన సోషల్ మీడి( Social media )యా పేజీలో ఓ ఆసక్తికరమైన విషయం పంచుకున్నారు.చెన్నైలో నివసించే ఒక మధ్యతరగతి కుటుంబం గురించి ఆయన చెప్పారు.

 Chennai, Physiotherapist Family Buying House Details, Chennai, Physiotherapist-TeluguStop.com

ఆ కుటుంబంలో భార్యభర్తలిద్దరూ ఫిజియోథెరపిస్ట్‌లు.వారిద్దరి మంత్లీ శాలరీ లక్షన్నర రూపాయలకు పైగా ఉంటుందట.

ఇంత సంపాదించినా కూడా, ఆ కుటుంబానికి ఒక ఇల్లు కొనడం చాలా కష్టంగా మారిందని ముత్తుకృష్ణ చెప్పారు.చెన్నైలోని ధనవంతులు నివసించే ప్రాంతంలో వీరు ఒక క్లినిక్ నడుపుతున్నారు.

ఆయన కూడా అదే ప్రాంతంలోనే ఉంటారు.

ముత్తుకృష్ణ( Muthukrishna) తన ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్‌లో ఈ కపుల్ పరిస్థితి గురించి వివరించారు.ఆయన చెప్పిన దాని ప్రకారం, ఆ దంపతులిద్దరి వయసు 30ల చివరలో ఉంటుంది.భర్త ఫుల్ టైమ్ పని చేస్తారు.

భార్య మాత్రం ఇద్దరు పిల్లలను చూసుకోవడం వల్ల పార్ట్ టైమ్ మాత్రమే పని చేస్తుంది.వారు ఒక్కొక్క సెషన్‌కు 500 రూపాయలు తీసుకుంటారు.

కానీ, క్లినిక్ నిర్వహణకు చాలా ఖర్చు అవుతున్నందువల్ల, వారికి ఇల్లు కొనడం చాలా కష్టంగా ఉందట.ఈ ఫిజియోథెరపిస్ట్ దంపతులు నెలకు దాదాపు రూ.1.5 లక్షలు ఆదా చేస్తున్నారట.భర్త రూ.1 లక్ష, భార్య రూ.50 వేలు ఆదా చేస్తున్నారు.ఇంత ఆదా చేసినా కూడా, వారు చెన్నైలో ఇల్లు కొనలేకపోతున్నారు.

ఇదే విషయం చాలా మందికి సమస్యగా మారింది.పెద్ద నగరాలలో లివింగ్ కాస్ట్ లన్నీ బాగా పెరిగిపోయాయి.ఇల్లు షాపుల రెంట్స్ కారణంగా ప్రజలు తమ జీతంలో సగం నష్టపోతున్నారు.ఇక ఒక మంచి చోట ఇల్లు కొనాలంటే కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది.ఈ ఇళ్లకు ఎంతో కొంత మనీ ఇచ్చి లోన్ తీసుకుందాం అన్నా కుదరని పరిస్థితి నెలకొన్నది.ఒక ఉద్యోగ నిపుణురాలు మాట్లాడుతూ, అన్ని రకాల పన్నులు కట్టినప్పటికీ, చదువుకున్న వారు కూడా డబ్బు సంపాదించడంలో ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.

ఉదాహరణకు, డాక్టర్లు కూడా నిర్ణీత లక్ష్యాలను చేరుకోవడానికి ప్రయత్నిస్తుండటంతో, వారికి సొంత డబ్బు సంపాదించడానికి సమయం దొరకడం లేదు.మరొక వ్యక్తి మాట్లాడుతూ, ఫిజియోథెరపిస్ట్‌ల లాంటి నిపుణులు కూడా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని చెప్పారు.

డబ్బును పెట్టుబడి పెట్టకపోతే, ఇల్లు కొనడం చాలా కష్టమేనని మరి కొంతమంది అంటున్నారు.అంటే ఆస్తి సంపాదించడం మొదలుపెట్టిన సమయం నుంచి మ్యూచువల్ ఫండ్స్ బడిలో స్టార్ట్ చేస్తే అప్పుడు కాంపౌండ్ వడ్డీ ద్వారా ఎక్కువ డబ్బులు సంపాదించడం కుదురుతుంది.

అలాంటి వారు మాత్రమే ఇల్లు కొనడం సాధ్యమవుతుంది ఇప్పటికి ఇప్పుడు డబ్బులు ఆదా చేస్తే పెద్దగా డబ్బులు సేవ్ చేయడం కుదరదు.ఫైనాన్షియల్ గోల్స్ రీచ్ కావడానికి అందరూ పెట్టుబడులను చాలా తీవ్రంగా తీసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube