బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో గా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న బిగ్ బాస్ ( Bigg Boss ) కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అన్ని భాషలలో ఎంతో విజయవంతంగా ముందుకు సాగుతున్న ఈ కార్యక్రమం తెలుగులో ఎనిమిదవ సీజన్ ప్రసారం అవుతుంది.
ఇప్పటికే ఈ సీజన్ 5 వారాల పూర్తి చేసుకోగా ఐదవ వారంలో ఈ కార్యక్రమంలోకి వైల్డ్ కార్డు( Wild Card ) ద్వారా ఏకంగా 8 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి అడుగుపెట్టారు.ఇలా 8 మంది హౌస్ లోకి వెళ్లడంతో ఆట మరో లెవెల్ లో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుందని చెప్పాలి.
ఇకపోతే బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టిన వారిలో హరితేజ, రోహిణి, నయని పావని, గంగవ్వ, గౌతమ్ కృష్ణ, ముక్కు అవినాష్, మెహబూబ్, టేస్టీ తేజ ఉన్నారు.వీరందరూ కూడా గత సీజన్లలో కంటెస్టెంట్స్ గా పాల్గొన్న వారే అని చెప్పాలి.ఇక ఈ కార్యక్రమంలోకి వైల్డ్ కార్డు ద్వారా ఎంటర్ ఇచ్చిన గంగవ్వ సీజన్ ఫోర్ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు.అయితే ఈ కార్యక్రమంలో గంగవ్వ ( Gangavva ) అనారోగ్యానికి గురి కావడంతో ఆమె కోరిక మేరకు బిగ్ బాస్ తనని హౌస్ నుంచి బయటకు పంపించారు.
ఇలా బయటకు వెళ్లిన గంగవ్వ ఈ సీజన్లో వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టి తన సత్తా ఏంటో చూపిస్తున్నారు.ఈమె ఆరు పదుల వయసులో కూడా యంగ్ కంటెస్టెంట్లకు పెద్ద ఎత్తున పోటీ ఇవ్వడమే కాకుండా ఓటింగ్ శాతం లో కూడా దూసుకుపోతున్నారు.ఇలా వైల్డ్ కార్డు ద్వారా బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన గంగవ్వ ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ అందుకుంటున్నారనే విషయంపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి.సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం గంగవ్వ వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం కోసం వారానికి ఏకంగా 3.5 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ ( Remuneration ) తీసుకుంటున్నారని తెలుస్తోంది.