సినిమాలు రూపొందించడానికి నిర్మాతలు చాలా కోట్లు ఖర్చు పెడతారు.సినిమా హీరోలు, దర్శకులు, ఇంకా ఇతర క్యాస్ట్ అండ్ క్రూ ఎంతో కష్టపడతారు.
ఇలా కష్టపడి తీసిన సినిమాని లీక్( Movie Leaks ) కాకుండా చాలా జాగ్రత్త పడుతుంటారు.థియేటర్లలో ప్రేక్షకులకు సర్ ప్రైజ్ ఇవ్వాలని సినిమాలో కంటెంట్( Movie Content ) ఎలా ఉందో తెలపకుండా సస్పెన్స్ క్రియేట్ చేయాలని భావిస్తుంటారు.
కానీ కొన్నిసార్లు సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే ఫైట్స్, సాంగ్‌ల షూటింగ్ ఫుటేజ్‌లు బయటకు వస్తుంటాయి.ఈ పని మూవీ టీంలోని ఎవరో ఒకరు సీక్రెట్ గా చేసి ఉంటారని, లేదంటే అభిమానులే లీక్ చేసి ఉంటారని చాలామంది బ్లేమ్ చేస్తుంటారు.
కొన్ని సందర్భాల్లో ఇది నిజమే కావచ్చు కానీ ఎక్కువ సందర్భాల్లో మూవీ టీమ్‌లే( Movie Teams ) కావాలని లీకులు చేస్తాయట.
సాధారణంగా అభిమానులు తనకి ఇష్టమైన మూవీ నుంచి ఏదో ఒక అప్డేట్ రావాలని ఆశిస్తూ ఉంటారు.టీజర్, ట్రైలర్, ఫస్ట్ సింగిల్, సెకండ్ సింగిల్, పోస్టర్, క్యాస్టింగ్ ఇలా ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా వారికి ముఖ్యమే అవుతుంది.అలాంటి సమయంలో ఆ సినిమా నుంచి లీక్ వచ్చిందంటే చాలు దాన్ని చూసేయాలని చాలామంది తాపత్రయపడతారు.
సినిమా మీద ఇంట్రెస్ట్ లేనివారికి కూడా లీక్ అయిన క్లిప్స్, ఫోటోలు ఏంటి? అనే ఒక క్యూరియాసిటీ పెరిగిపోతుంది.వాటిని చూడడానికి ఇంటర్నెట్ మొత్తం వెతికేస్తారు.
ఈ సినిమా గురించి మొత్తం భారతదేశం అంతటా కూడా తెలిసిపోతుంది.
మూవీ టీములకు కావాల్సిందే ఇదే.మామూలుగా వారు టీజర్, ట్రైలర్ రిలీజ్ చేస్తే చూసే వాళ్లు చూస్తారు, మిగతావారు పట్టించుకోరు.అదే ఏదైనా ఫుటేజీ లీక్ చేస్తే సినిమా వేరే లెవల్లో ప్రమోట్ అవుతుంది.
దాని గురించి అందరూ ఎక్కువగా మాట్లాడుకుంటారు.అందుకే మూవీ టీమ్స్ కావాలని వీటిని లీక్స్ చేస్తూ ఉంటాయని కొందరు చెబుతుంటారు.
ఆ తర్వాత ఆ లీక్ కంటెంట్ బ్యాన్ చేయడం జరుగుతుంది.ఈ లీక్స్ పట్ల చాలా సీరియస్ గా కూడా వ్యవహరిస్తారు.
మూవీ లీక్ చేయడం అనేది ఇల్లీగల్. దాన్ని లీగల్ గా ట్రీట్ చేస్తే వేరే వారిని ప్రోత్సహించినట్లే అవుతుంది.ఇక లీకులు సర్వసాధారణం అయిపోతాయి.చివరికి అసలుకే ఎసరు వచ్చే అవకాశం ఉంది.అందుకే తామే లీక్స్ చేస్తున్నట్లు ఎవరికీ తెలియకుండా వీరు ఈ పని చేస్తుంటారని సినిమా విశ్లేషకులు చెబుతుంటారు.