రజినీకాంత్ యంగ్ డైరెక్టర్స్ ను ఎంకరేజ్ చేయడానికి కారణం ఏంటి..?

తమిళ్ సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్( Rajinikanth ) తనదైన రీతిలో సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే.70 సంవత్సరాల పైబడిన కూడా ఇప్పటికీ ఆయన యంగ్ హీరోలతో పోటీపడుతూ మరి మంచి సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు.ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు ఆయనతో సినిమాలు చేసి మంచి విజయాలను అందుకున్న సీనియర్ దర్శకులతో కాకుండా ప్రస్తుతం ఇండస్ట్రీలో తమ సత్తాను చాటుకుంటున్న యంగ్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు.

 What Is The Reason For Rajinikanth Encouraging Young Directors Details, Rajinika-TeluguStop.com
Telugu Coolie, Jailer, Nelsondileep, Rajinikanth, Young Directors-Movie

ఇక ఏది ఏమైనప్పటికీ ఆయన చేస్తున్న సినిమాలన్నీ ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధించడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసుకుంటున్నాడు.ఆయన చేస్తున్న ప్రతి సినిమా విషయంలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుంది.ఇక ప్రస్తుతం ఆయన లోకేష్ కనకరాజ్( Lokesh Kanagaraj ) డైరెక్షన్ లో చేస్తున్న కూలీ సినిమా( Coolie ) సూపర్ సక్సెస్ అవుతుందని చెప్పడానికి ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

అయితే ఆయన యంగ్ డైరెక్టర్స్ ను ఎంకరేజ్ చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే వాళ్ళు అయితే ఫ్రెష్ థాట్స్ తో మంచి కథలను రాసుకుంటారు.

 What Is The Reason For Rajinikanth Encouraging Young Directors Details, Rajinika-TeluguStop.com
Telugu Coolie, Jailer, Nelsondileep, Rajinikanth, Young Directors-Movie

కాబట్టి అలాంటి కథలతో సినిమాలు చేస్తే ఆయనకు కూడా మార్కెట్ బాగా వర్కౌట్ అవుతుందనే ఉద్దేశంతోనే యంగ్ డైరెక్టర్స్ ని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నారు.ఇక దానివల్ల ఇండస్ట్రీకి చాలామంది యంగ్ డైరెక్టర్స్ రావడమే కాకుండా ఈయనతో సినిమాలు చేసి స్టార్ డైరెక్టర్ గా కూడా మారుతున్నారు.ఇక జైలర్ సినిమాతో( Jailer ) నెల్సన్ సూపర్ సక్సెస్ ని అందుకొని స్టార్ డైరెక్టర్ లిస్ట్ లో చేరిపోయాడు.

ఇక ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం రజనీకాంత్ తనదైన రీతిలో సినిమాలను చేస్తూ ఇండస్ట్రీ లో ఉన్న సీనియర్ హీరోలందరికంటే తను ముందు వరుసలో కొనసాగుతున్నాడనే చెప్పాలి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube