కెనడా( Canada)లో గృహ సంక్షోభం తారాస్థాయిలో ఉన్న సంగతి తెలిసిందే.ఈ దెబ్బతో ఏకంగా అంతర్జాతీయ వలసదారుల రాకపై జస్టిన్ ట్రూడో ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది.తాజాగా కెనడాకు చెందిన ఇంటి యజమాని భారతీయ అద్దెదారుడిని బలవంతంగా ఖాళీ చేయిస్తున్న వీడియో వైరల్ అయ్యింది.15 సెకన్ల ఈ క్లిప్ సోషల్ మీడియా( Social media )లో దుమారం రేపింది.ఏకంగా 1.7 మిలియన్ల మంది ఆ వీడియోను వీక్షించారు.భారతీయ అద్దెదారుడు నిస్సహాయంగా కనీసం ఒంటిపై చొక్కా లేకుండా నిలబడి ఉండటాన్ని గమనించవచ్చు.ఈ సంఘటన యజమాని – అద్దెదారు సంబంధాల గురించి, మరి ముఖ్యంగా విదేశాల్లో నివసిస్తున్న భారతీయ వలసదారులను ఆందోళనకు గురిచేసింది.
కెనడాలోని బ్రాంప్టన్( Brampton )లో జరిగిన ఈ ఘటనలో అద్దెదారుడితో కెనడాకి చెందిన యజమాని గొడవపడ్డాడు.ఇల్లు ఖాళీ చేయమన్నా చేయకపోవడంతో కోపంతో ఊగిపోయిన యజమాని .భారతీయుడి వస్తువులను బలవంతంగా విసిరిపారేశాడు.సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.
నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.అద్దెదారుడు ఇంటిని ఖాళీ చేయడానికి నిరాకరించవచ్చని కొందరు అభిప్రాయపడ్డారు.
మరికొందరు యజమాని ఇంత కఠినంగా వ్యవహరించి ఉండకూడదని పేర్కొన్నారు.పరాయి దేశంలో ఇలా రోడ్డునపడటం అత్యంత బాధాకరమని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు.
అడిగినప్పుడే ఇల్లు ఖాళీ చేసి ఉంటే ఈ పరిస్ధితి వచ్చేదా అని ప్రశ్నిస్తున్నారు.
కాగా.ప్రస్తుతం కెనడాలో గృహ సంక్షోభం, ఉద్యోగ సంక్షోభం తీవ్రరూపు దాల్చింది.వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న వేళ .ఈ పరిణామాలు జస్టిన్ ట్రూడో ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారాయి.ఇప్పటికే అనేక సర్వేల్లోనూ ట్రూడో పార్టీకి ప్రతికూల ఫలితాలు వస్తున్నాయి.
అందుకే వీటిని కప్పిపుచ్చుకోవడానికి ప్రధాని ఇలాంటి విపరీత చర్యలకు దిగుతున్నారని అంతర్జాతీయ వలసదారులు ఆరోపిస్తున్నారు.కొత్త వలస విధానం కారణంగా శాశ్వత నివాస దరఖాస్తులు దాదాపు 25 శాతం తగ్గనున్నాయి, అలాగే విదేశీ విద్యార్ధుల స్టడీ పర్మిట్లు కూడా తగ్గుతాయి.
దీని వల్ల భారతీయ విద్యార్ధులకు( Indian students ) అధిక నష్టం కలుగుతుందని ఇమ్మిగ్రేషన్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.