ఈ సినిమాల్లో హీరోల ఎంట్రీ చూస్తే పూనకాలే.. హాలీవుడ్ పనికిరాదు..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోల ఇంట్రడక్షన్ సీన్లు నెక్స్ట్ లెవెల్‌లాల్ ఉంటాయని చెప్పుకోవచ్చు.బాలకృష్ణ, చిరంజీవి ఇలా చెప్పుకుంటూ పోతే వీరి ఎంట్రీలు చూస్తుంటే గూస్‌ బంప్స్ వస్తాయని చెప్పుకోవచ్చు.

 Tollywood Hero's Entry As Hollywood Level , Oosaravelli, Tollywood Hero , Hollyw-TeluguStop.com

అయితే వీరందరి కంటే కొంతమంది హీరోల ఎంట్రీలు మరింత క్రియేటివ్, ఊర మాస్ లెవెల్ లో వచ్చాయి.ఈ ఇంట్రడక్షన్లు చూస్తే హాలీవుడ్ కూడా పనికి రాదు అని అనిపిస్తుంది అవేవో తెలుసుకుందాం.

• ఊసరవెల్లి – జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రో

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన 2011 యాక్షన్ థ్రిల్లర్ మూవీ “ఊసరవెల్లి”( oosaravelli ) బ్లాక్ బస్టర్ హిట్ అయింది.ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) ఇంట్రో నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని చెప్పుకోవచ్చు.తారక్ ఇంట్రో సీన్ లో ఆయన గురించి ఒక డిస్క్రిప్షన్ కూడా చెప్తారు.“అతడు ఎదురుగా ఎలాంటివాడు ఉన్నా తన తల దన్నే లాగా ఉంటాడు.వాడి బ్లడ్ వాడిలాగే బి నెగిటివ్.వాడి నరాలు నరాలు కాదు హై టెన్షన్ వైర్లు.” అని బాగా ఎలివేట్ చేస్తారు.ఈ ఎలివేషన్ చేసే సమయంలోనే సైమల్టేనియస్‌గా అస్తిపంజరం వేగంగా పరిగెత్తుకుంటూ వస్తుంది.

ఆ స్కెలిటన్ అలా పరిగెత్తుకుంటూ వస్తుంటే నేలపై ఉన్న దుమ్ము లేచిపోతుంది.తర్వాత ఆ అస్తిపంజరం చుట్టూ మజిల్స్ పెరగడం, తర్వాత రక్తం ఆ బాడీలో సర్కులేట్ కావడం చూపించారు.

ఒక లావా లాగా అతని రక్తం ఉడుకుతూ ఉంటుంది.తర్వాత నరాలు ఆ బాడీ అంతా విస్తరించడం, అది జూనియర్ ఎన్టీఆర్ రూపం దాల్చడం కనిపిస్తుంది.

చివరికి తారక్ ఒక పెద్ద గోడని ఢీకొడితే ఆ గోడ కూడా తునాతునకలవుతుంది.ఆల్రెడీ ఈ ఇంట్రడక్షన్ చూడకపోతే ఒకసారి అయినా దీన్ని చూడాల్సిందే.

Telugu Arya, Billa Prabhas, Bunny, Chirutharam, Hollywood Level, Ntr, Oosaravell

• చిరుత – రామ్ చరణ్

( Chirutha – Ram Charan )

పూరి జగన్నాధ్ డైరెక్ట్ చేసిన చిరుత (2007) సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే ఇందులో రామ్ చరణ్ ఎంట్రీ చాలా బాగుంటుంది.అతను ఒక జైల్లో ఇతర రౌడీ ఖైదీలను కొట్టడానికి తన ముఖానికి మమ్మీ లాగా ఒక వస్త్రాన్ని చుట్టుకుంటాడు.రౌడీలు తనని గుర్తుపట్టి మళ్లీ అటాక్‌ చేయకుండా ఉండడానికి ఇలా చేస్తాడు.అయితే ఫైట్ చేస్తున్నప్పుడు ఒక ఖైదీ చెర్రీ ముఖానికి కట్టుకున్న వస్త్రాన్ని పట్టుకొని లాగేస్తాడు ఆ సమయంలో రామ్ చరణ్ గాల్లో చుట్టూ తిరుగుతూ తన ముఖానికి ఉన్న వస్త్రాన్ని విప్పుతాడు.

అలా తన ఫేస్ రివిల్ చేసి అద్భుతంగా ఎంట్రీ ఇస్తాడు.ఆ సమయంలో మణిశర్మ కొట్టిన బీజీఎం ఆ సన్నివేశాన్ని వేరే లెవల్లో ఎలివేట్ చేసిందని చెప్పుకోవచ్చు.

Telugu Arya, Billa Prabhas, Bunny, Chirutharam, Hollywood Level, Ntr, Oosaravell

• బాహుబలి – ప్రభాస్

( Baahubali – Prabhas )

బాహుబలి పార్ట్ 2లో ప్రభాస్ ఏనుగులను అదుపు చేయడానికి ఒక పెద్ద వినాయకుడి రథాన్ని లాక్కుంటూ వస్తాడు.ఆ సీన్ కూడా చాలా బాగుంటుంది.బాహుబలి పార్ట్ 1లో బాణాలను ఎదుర్కొంటూ ప్రభాస్ ఎంట్రీ ఇస్తాడు అది కూడా బాగుంటుంది.

Telugu Arya, Billa Prabhas, Bunny, Chirutharam, Hollywood Level, Ntr, Oosaravell

• బిల్లా – ప్రభాస్

( Billa – Prabhas )

బిల్లా మూవీలో ప్రభాస్ చాలా స్టైలిష్ గా సూట్‌లో ఎంట్రీ ఇస్తాడు.పైన హెలికాఫ్టర్లు తిరుగుతూ ఉంటే ప్రభాస్ వాటి కింద సూట్‌కేసు పట్టుకొని నడుస్తూ వస్తుంటాడు అది చూస్తుంటే ఎవరికైనా సరే గూస్‌బంప్స్‌ రావాల్సిందే.

Telugu Arya, Billa Prabhas, Bunny, Chirutharam, Hollywood Level, Ntr, Oosaravell

• ఆర్య – బన్నీ

( Arya, Bunny )

ఆర్యలో అల్లు అర్జున్ ఇంట్రడక్షన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.ఇందులో బన్నీ ఒక డ్రైనేజీలోకి దూకి ఓ కుక్క పిల్లను కాపాడతాడు.అతన్ని వాటర్ తో కడుగుతారు.

అప్పుడు బన్నీ ఫేస్ రివిల్ అవుతుంది.ఇలాంటి ఇంట్రో ఎవరూ కూడా చేసే సాహసం చేయలేదంటే అతిశయోక్తి కాదు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube