తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ( Minister Bandi Sanjay ) హైడ్రా పేరుతో తెలంగాణ ప్రభుత్వం వసూళ్లకు పాల్పడుతోందని విమర్శించారు .
కాలేశ్వరం పేరుతో బిఆర్ఎస్ పార్టీ వేలకోట్లు దండుకున్నట్లే హైదరాబాద్తో కాంగ్రెస్ ప్రభుత్వం వేలకోట్ల ఆదాయం సంపాదించుకుంటుందని సంజయ్ మండిపడ్డారు.గత కొద్ది రోజులుగా తెలంగాణలో హైడ్రా( Hydra ) పేరుతో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న పేరుపై అనేక విమర్శలు వ్యక్తం అవుతున్నాయి కొంతమంది ఈ విషయంలో రేవంత్ రెడ్డిని సమర్థిస్తూ ఉండగా మరి కొంతమంది విమర్శలు చేస్తున్నారు తెలంగాణ బీజేపీ నాయకులు కొంతమంది రేవంత్ రెడ్డి చర్యలను సమర్థిస్తుండగా బండి సంజయ్ వంటి వారు విమర్శలకు పాల్పడుతున్నారు .
హైడ్రా పేరుతో ఎప్పటికి ఎంతోమంది సినీ రాజకీయ ప్రముఖుల కు చెందిన నిర్మాణాలను కూల్చేసిన సంఘతి తెలిసింది అయితే ఈ కూల్చివేతలలో అనేకమంది సామాన్యులకు నిర్మాణాలు ఉండడం వంటి వాటిపై తెలంగాణ ప్రభుత్వ తీరుపై అనేక విమర్శలు వ్యక్తం అవుతున్నాయ వినేపద్యంలోనే బిజెపి తరఫున బండి సంజయ్ రేవంత్ ప్రభుత్వం పై చివరి స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.తాజాగా కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన సంజయ్ బిజెపి( BJP ) ఎప్పుడు పేదల పక్షానే ఉంటుందని, వారి కోసమే ఒంటరిగా పోరాటం చేస్తుందని అన్నారు.
తమ నాయకుడు , రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి( Union Minister Kishan Reddy ) నాయకత్వంలో పేదల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని అన్నారు.తమిళనాడులో ఉదయినిది స్టాలిన్ కు డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టడం పైన సంజయ్ విమర్శలు చేశారు.ఈ తరహా వారసత్వ రాజకీయాలు ప్రజా ప్రభుత్వాలకు మంచిది కాదని, వీటిని తాము ఖండిస్తున్నామని అన్నారు.కరీంనగర్లో విలీన గ్రామాల గురించి ప్రస్తావించారు.గ్రామాలను విలీనం చేసే ముందు ప్రభుత్వం స్థానికులు అభిప్రాయం తీసుకోవాలని సూచించారు
.