జంతువులు చాలా అన్‌ప్రెడిక్టబుల్.అంటే అవి ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో ఎవరూ ఊహించలేరు.
ముఖ్యంగా వైల్డ్ అనిమల్స్( Wild Animals ).ఇంటి దగ్గరికి వెళ్లకపోవడమే మంచిది కానీ ప్రజలు మాత్రం వాటిని ఎప్పుడు డిస్టర్బ్ చేస్తూ ఉంటారో చివరికి ఆ జంతువుల కోపానికి దెబ్బయిపోతుంటారు.తాజాగా ఒక బుడ్డోడు జంతువులతో పెట్టుకుంటే దిమ్మతిరిగిపోద్ది అనే ఒక లైఫ్ లెసన్ నేర్చుకున్నాడు.ఈ పిల్లవాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రముఖ సోషల్ మీడియా( Social media ) ప్లాట్‌ఫామ్ ఎక్స్ (ట్విట్టర్)లో “నేచర్ ఇస్ క్రూయల్” పోస్ట్ చేసిన ఆ వీడియో చూసి చాలామంది షాక్ అవుతున్నారు.ఈ వీడియోలో చిన్న పిల్లవాడు ఒక గుర్రంతో ఆడుకుంటూ దానిని చాలా ప్రేమగా తాకుతున్న దృశ్యం కనిపించింది.కానీ అనుకోకుండా గుర్రం ( horse )పిల్లవాడిని తన్నడంతో పిల్లవాడు నేలపై పడిపోతాడు.గుర్రం చిన్నగానే తన్నింది దానికే పిల్లోడు దూరంగా పడిపోయాడు అంతేకాదు బాగా ఏడ్చేస్తూ పైకి కూడా లేవలేకపోయాడు.
ఈ ఘటన చూసిన వారందరూ షాక్ అయ్యారు.పిల్లవాడి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నారు.

ఈ వీడియో చూసిన నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు వస్తున్నాయి.కొంతమంది పిల్లవాడికి ఏమైందో అని చాలా బాధపడుతున్నారు.కొంతమంది మాత్రం ఈ సంఘటనను చూసి నవ్వుకుంటున్నారు.ఈ వీడియో ద్వారా మనం ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవచ్చు.అదేమిటంటే, జంతువులు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో ఎవరూ తెలుసుకోలేరు.అవి చాలా అందంగా ఉన్నా కూడా మనల్ని హర్ట్ చేయవచ్చు.
అందుకే జంతువులతో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి.వాటిని గౌరవించాలి.
ఈ వీడియో చూసిన తర్వాత తల్లిదండ్రులు తమ పిల్లలకు జంతువులతో ఎలా మెలగాలో కూడా చెప్పాలి.గుర్రాలు చాలా సాదు జీవులుగా కనిపిస్తాయి కానీ, ఎవరైనా వాటిని భయపెడితే అవి కూడా తమను తాము రక్షించుకోవడానికి ప్రయత్నిస్తాయి.







