రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామ ప్రజలు గ్రామపంచాయతీ సిబ్బందిని కేసీఆర్ నగర్ కు కేటాయించడాన్ని నిరసిస్తూ విధులకు వెళుతున్న గ్రామపంచాయతీ సిబ్బందిని అడ్డుకొని గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.
మండెపల్లి గ్రామ నిధులను డబుల్ బెడ్ రూమ్ లకు మళ్ళించకూడదని కెసిఆర్ నగర్ ని మండెపల్లిలో విలీనం చేయవద్దని డిమాండ్ చేస్తూ ఒకవేళ విలీనం చేసినట్లయితే పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకలు చేపడతామన్నారు.
అనంతరం పోలీసులు ధర్నా ప్రాంతానికి చేరుకొని గ్రామస్తులకు నచ్చజెప్పి నిరసనను విరమింపజేశారు.







