టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీలో చాలా రోజుల తర్వాత జరుగుతున్న గ్రాండ్ ఈవెంట్లలో దేవర మూవీ ఈవెంట్ కూడా ఒకటి అనే సంగతి తెలిసిందే.దేవర మూవీ ఈవెంట్ కు రాజమౌళి, ప్రశాంత్ నీల్, త్రివిక్రమ్ లకు ఆహ్వానం అందింది.
అయితే ఈ మధ్య కాలంలో ఒక వివాదంలో త్రివిక్రమ్( Trivikram ) పేరు వినిపించిన నేపథ్యంలో ఆయన ఈ ఈవెంట్ కు వస్తారా? రారా? అనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతుండటం గమనార్హం.
అయితే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ( Young Tiger Jr.NTR )కు త్రివిక్రమ్ కు మధ్య మంచి అనుబంధం ఉంది.తారక్ త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన అరవింద సమేత వీర రాఘవ మూవీ ( Veera Raghava movie )బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
ఈ కాంబినేషన్ లో మరో మూవీ కూడా తెరకెక్కనుందని ఒకింత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం.

ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబో మూవీ భవిష్యత్తులో కచ్చితంగా ఉంటుందని ఈ విషయంలో ఎలాంటి సందేహం అవసరం లేదని తెలుస్తోంది.మరోవైపు దేవర ఈవెంట్ లో ఈ సినిమా నుంచి మరో ట్రైలర్ రిలీజ్ కానుందని ఫస్ట్ ట్రైలర్ ను మించే విధంగా సెకండ్ ట్రైలర్ ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.దేవర సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ అనే సంగతి తెలిసిందే.

అనిరుధ్ తన మ్యూజిక్, బీజీఎంతో ఏ రేంజ్ లో దేవర రేంజ్ ను పెంచుతారో చూడాల్సి ఉంది.త్రివిక్రమ్ వివాదం విషయంలో పూనమ్ కౌర్ ను సాక్ష్యాలు సమర్పించాలని కోరినట్టు సమాచారం అందుతోంది.పూనమ్ కౌర్ సమర్పించే ఆధారాలను బట్టి ఈ వివాదం విషయంలో ముందుకెళ్లనున్నారని సమాచారం అందుతోంది.దేవర రిలీజ్ తర్వాత ఈ సినిమాకు ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.