ఎన్టీఆర్( NTR ) తాజాగా నటించిన చిత్రం దేవర.( Devara ) కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జాన్వీ కపూర్( Janhvi Kapoor ) హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.ఈ సినిమా ఈనెల 27న విడుదల కానుంది.ఈ సందర్భంగా చిత్ర బృందం ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.ఒకవైపు ప్రమోషన్స్ లో పాల్గొంటూనే మరొకవైపు సినిమాకు సంబంధించి ఒక్కొక్క అప్డేట్ ని విడుదల చేస్తూ వస్తున్నారు.సినిమా నుంచి విడుదల అవుతున్న ఒక్కొక్క అప్డేట్ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.
ఇది ఇలా ఉంటే తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ ని చెన్నైలో( Chennai ) నిర్వహించారు.
![Telugu Chennai, Devara Chennai, Devara, Janhvi Kapoor, Koratala Siva, Ntr Fans, Telugu Chennai, Devara Chennai, Devara, Janhvi Kapoor, Koratala Siva, Ntr Fans,](https://telugustop.com/wp-content/uploads/2024/09/ntr-janhvi-kapoor-speech-in-tamil-detailsa.jpg)
ఈ సందర్భంగా ఈ ప్రమోషన్స్ లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ తమిళంలో( Tamil ) స్పీచ్ అదరగొట్టారు.దీంతో ఎన్టీఆర్ అభిమానులు అరుపులతో కేకలతో హోరెత్తించారు.ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ… చెన్నై చాలా ప్రత్యేకమైన ప్లేస్ నాకు.
వెంపటి చినసత్యం సర్ చెన్నైలోనే కూచిపూడి నేర్పించారు.ఇక్కడ దేవర పిల్లర్స్ ను ఇలా వేదికపై చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని అన్నారు.
సాబు, ఆండీ, శ్రీకర్ ప్రసాద్ వంటి సీనియర్ టెక్నీషియన్లకు తారక్ కృతజ్ఞతలు తెలిపారు.దేవర మూవీ చాలా ప్రత్యేకమైనది.
మీరంతా థియేటర్లలో వీక్షించండి.
![Telugu Chennai, Devara Chennai, Devara, Janhvi Kapoor, Koratala Siva, Ntr Fans, Telugu Chennai, Devara Chennai, Devara, Janhvi Kapoor, Koratala Siva, Ntr Fans,](https://telugustop.com/wp-content/uploads/2024/09/ntr-janhvi-kapoor-speech-in-tamil-detailsd.jpg)
ఎన్వీ ప్రసాద్ సర్ ఈ సినిమాని తమిళనాడులో పంపిణీ చేస్తున్నారు.ఆయన నాకు చాలా లక్కీ, మరోసారి అది నిరూపణ అవుతుంది.ఇందులో తమిళ సీనియర్ నటుడు కళై సర్ కుంజర అనే పాత్రలో నటించారు.
దేవర-కుంజర పాత్రలను తెరపై చూడండి అని అన్నారు.అలాగే జాన్వీ కపూర్ తన పాత్రకు అద్భుతంగా న్యాయం చేసిందని ఎన్టీఆర్ ప్రశంసించారు తారక్.
ఈ మేరకు ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.మొత్తానికి తారక్ ఈ సినిమా ప్రమోషన్స్ లో ఫుల్ యాక్టివ్ గా పాల్గొంటున్నారు.
ఇకపోతే తాజాగా తారక్ తమిళంలో మాట్లాడిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఎన్టీఆర్ అభిమానులు వాటిని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.