ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు కమెడియన్ సత్య.( Comedian Satya ) గత నాలుగు ఐదు రోజులుగా సత్యా పేరు మారుమోగుతున్న విషయం తెలిసిందే.
ఇటీవల విడుదలైన ఒక సినిమాలో సత్యా తన టాలెంట్ ను నిరూపించుకున్నారు.అంతేకాకుండా ఆ సినిమా కమెడియన్ సత్యా వల్ల వేరే స్థాయికి వెళ్ళింది అంటే సత్య పర్ఫామెన్స్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
సినిమాను ఒక కమెడియన్ నిలబెట్టడం అన్నది చాలా అరుదుగా జరిగే విషయం.ఆ విషయాన్ని తాజాగా సత్య చేసి నిరూపించారు.
మత్తు వదలరా 2( Mathu Vadalara 2 ) సినిమాలో హీరో యాక్టింగ్ ని డామినేట్ చేస్తూ ఆ సినిమా సక్సెస్ అవ్వడానికి కారణం అయ్యారు.
తన పర్ఫామెన్స్ తో అదరగొట్టేశారు.ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమాలో హీరో కంటే సత్యాకి ఎక్కువ గుర్తింపు దక్కిందని చెప్పాలి.ఒంటి చేత్తో మత్తు వదలరా 2 సినిమాను నిలబెట్టారు.
సత్య పెర్ఫామెన్స్ అంచనాలను మించిపోయాయి.నాన్ స్టాప్ కామెడీతో ప్రేక్షకులకు మంచి కాలక్షేప వినోదాన్ని అందించడంతో సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా సాగిపోయింది.
కెరీర్లో ఇన్నేళ్లలో వచ్చినా గుర్తింపు అంతా ఒకెత్తయితే.మత్తు వదలరా-2 సినిమాతో అతడికి వచ్చిన గుర్తింపు మరో ఎత్తు అని చెప్పాలి.
సత్య ఎన్నో ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ గత ఐదారేళ్లుగానే అతను బిజీగా ఉంటున్నాడు.తన పేరు అందరికీ తెలియడానికి, కమెడియన్‌గా బిజీ అవడానికి చాలా కాలమే పట్టింది.
సత్య దాదాపు 20 ఏళ్ల కిందట్నుంచే ఇండస్ట్రీలో ఉన్నాడంటే ఆశ్చర్యపోవాల్సిందే.
ఒకప్పుడు జెమిని టీవీలో సెన్సేషన్ క్రియేట్ చేసిన అమృతం సీరియల్లో( Amrutham Serial ) సత్య నటించడం విశేషం.ఒక ఎపిసోడ్ లో అతను చిన్న పాత్ర చేశాడు.అప్పుడు అతడికి సొంతంగా డబ్బింగ్ చెప్పుకునే అవకాశం కూడా రాలేదు.
ఇంకెవరో వాయిస్ ఇచ్చారు.మంచి వాయిస్ ఉన్నప్పటికీ సత్యకు వేరొకరితో డబ్బింగ్ చెప్పించడం ఆశ్చర్యం కలిగించే విషయమే.
అమృతం సీరియల్లో అప్పుడప్పుడూ నటులు కాని వాళ్లు, టెక్నీషియన్లు కూడా చిన్న చిన్న పాత్రలు చేసేవారని తెలిసిందే.సత్య కూడా అలాగే అందులో నటించినట్లున్నాడు.
ఎందుకంటే కెరీర్ ఆరంభంలో అతను దర్శకుడు కావాలనుకున్నాడు.అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పని చేశాడు.
ఐతే అనుకోకుండా నటనలోకి వెళ్లాడు.తర్వాత తెలుగులో చాలా సినిమాలలో కమెడియన్ పాత్రలలో నటించారు.
ఇన్నాల్టికి ఆయనకు అనుకున్న గుర్తింపు దక్కింది.