రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం( Praja Palana Dinotsavam ) సందర్భంగా ఈ రోజు 17వ పోలీస్ బెటాలియన్ సర్దాపూర్ లో బెటాలియన్ కమాండెంట్ యస్.శ్రీనివాస రావు జాతీయ జెండా ఎగురవేశారు.
ఈ సందర్భంగా కమాండెంట్ యస్.శ్రీనివాస రావు మాట్లాడుతూ ఈ రోజు మనమందరం ప్రజాపాలన దినోత్సవము జరుపుకోవడానికి కారణం ఆగస్టు 15న దేశమంత స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ హైదరాబాద్ రాజ్యం నిజాం పాలనలో 1948 సెప్టెంబర్ 13 వరకు నిజాం పాలనలో మగ్గిపోతున్నది.అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ సెప్టెంబర్ 13 నుండి సెప్టెంబర్ 17 వరకు ఆపరేషన్ పోలో అనే సైనిక చర్య జరిపి హైదరాబాద్ రాజ్యంను భారతయూనియనులో కలపడంతో హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడి రాష్ట్ర ప్రజలకు విముక్తిని కలిగించారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రతి సంవత్సరం అందుకే సెప్టెంబర్ 17 ను తెలంగాణా విమోచన దినోత్సవంగా పాటిస్తారు.
తెలంగాణ ప్రాంతానికి నిజాం పాలన నుంచి విముక్తి కలిగిన సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకుంటున్నాము అని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ సాంబశివరావు, రాందాస్, ఉదయ్ భాస్కర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇ .ప్రమీల, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.