యాదాద్రి భువనగిరి జిల్లా: ఆత్మకూరు(ఎం)మండల( Athmakur (M) ) కేంద్రం నుండి మొరిపిరాల గ్రామంతో పాటు వివిధ గ్రామాలకు వెళ్ళే ప్రధాన రోడ్డు మూడు మూల మలుపులతో,ఏపుగా పెరిగిన కంప చెట్లతో, కల్వర్టుల వద్ద భారీ గుంతలతో అత్యంత ప్రమాదకరంగా మారిందని,ఈ మాత్రం ఆదమరిచినా ఇక అంతే సంగతులని ఆయా గ్రామాల ప్రజలు, వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మూల మలుపుల వద్ద ఏపుగా పెరిగిన కంప చెట్లతో ఎదురెదురుగా వచ్చే వాహనాలు( Vehicles ) Vehicles కనిపించక అనేక ప్రమాదాలు జరిగాయని,ఒకవేళ హారను కొడితే తప్ప ఏ వాహనం వస్తుందో తెలియని పరిస్థితి ఉందని,ఒకవేళ మూల మలుపుల వద్ద వాహనదారులు పక్కకు జరుగుదామన్న కంప చెట్లు ఉండడంతో జరగలేని పరిస్థితి నెలకొందని,పైగా వర్షం వచ్చిందంటే గుంతలు ఏర్పడి నీరు నిల్వ ఉండడంతో ఇబ్బందికరంగా మారిందని వాపోతున్నారు.
నిత్యంవాహనాలతో రద్దీగా ఉండే ఈ రోడ్డుపై ఎక్కడా సూచికలు లేకపోవడంతో రోడ్డు పక్కన పొలంలో వాహనదారులు పడిన సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయని,ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సూచికలు ఏర్పాటు చేసి,కంప చెట్లు తొలగించి,గుంతలు పూడ్చాలని వాహనదారులు,ప్రజలు కోరుతున్నారు.