తాత్కాలిక రోడ్డు పనుల పరిశీలన రాజన్న సిరిసిల్ల జిల్లా సిద్దిపేట- కామారెడ్డి ప్రధాన రహదారి మార్గం లోని లింగన్నపేట-గంభీరావుపేట మధ్యలో మానేరుపై నిర్మిస్తున్న హై లెవెల్ వంతెన వద్ద తాత్కాలిక రోడ్డు పనులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తనిఖీ చేశారు.వాహనదారులకు ఇబ్బంది కాకుండా రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలని ఆర్ అండ్ బి శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
అనంతరం గంభీరావుపేటలోని చెరువును పరిశీలించారు.