హీరో భాను చందర్ ( Bhanu Chander )గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అప్పట్లో చిరంజీవికి( Chiranjeevi ) పోటీగా భానుచందర్ ఉండేవాడు.
మంచి ఫిట్నెస్ కలిగి ఉండి మార్షల్ ఆర్ట్స్( Martial arts ) లో ట్రైనింగ్ తీసుకుని సినిమాలో నిజమైన ఫైట్స్ చేస్తూ ప్రేక్షకుల్లో ఉత్సాహం నింపేవాడు.అందుకే అతడిని చాలా మంది అభిమానించేవారు.
ఇక ఆయన సినిమాల విషయం గురించి ప్రస్తుతం మాట్లాడుకోవడం లేదు కానీ ఇటీవల ఒక మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వ్యక్తిగత జీవితంలో గల అనేక సంచలన విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు భానుచందర్.చాలామంది ఏదైనా తప్పు చేస్తే అది ఒప్పుకోవడానికి ఇష్టపడరు.
కానీ భానుచందర్ కి అలాంటి మొహమాటం ఏమీ లేదు.ఏదైనా సరే మొహం మీద చెప్పే అలవాటున్న ఆయన అదే విధంగా తను చేసిన తప్పులను కూడా ఒప్పుకుంటున్నారు.
ఇక ఆయన చెప్పిన విషయాలకు సంబంధించిన వివరాల్లోకి వెళితే 1969 నుంచి 75 ప్రాంతంలో ఆయన ఎక్కువగా డ్రగ్స్ తీసుకునే వారట.అప్పట్లో ఫారెన్ ( Faren )లో ఆయనకు ఫ్రెండ్స్ ఎక్కువగా ఉండేవారట.అలాగే ఇప్పుడు ఉన్నంత స్ట్రిక్ట్ గా కూడా అప్పుడు ఆఫీసర్స్ ఉండేవారు కాదట.అందుకనే కిలోల చొప్పున హెరయిన్ ఇంపోర్ట్ చేసుకుని రెండు మూడు రోజుల పాటు అదే మత్తులో ఉండేవారట.
హెరాయిన్ లేకపోతే ఉండలేని పరిస్థితి వచ్చింది అంట.ఒకసారి డ్రగ్ అలవాటు అయిన తర్వాత అది ఎంతటి ప్రభావాన్ని చూపుతుందో భానుచందర్ తన నిజ జీవితంలో అనుభవించాడు.ఇప్పుడు ఎవరూ కూడా అలాంటి తప్పు చేయకూడదు అని చెబుతున్నాడు.తన సోదరుడు తనని డ్రగ్స్ నుంచి బయటపడేలా చేశాడట.
నిజమైన డ్రగ్ అంటే హెరాయిన్ కాదని మార్షల్ ఆర్ట్స్ అని చెప్పి తనని ఒక వారం పాటు మార్షల్ ఆర్ట్స్ చేయమని చెప్పాడట.ఒకవేళ నచ్చకపోతే మళ్లీ యధావిధిగా డ్రగ్స్ వాడు అని చెప్పడంతో అందుకు భానుచందర్ ఓకే చెప్పాడట.అప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్ కి వెళ్లిన భానుచందర్ ఆ తర్వాత మళ్లీ ఎప్పుడు డ్రగ్స్ తీసుకోలేదట.పైగా మార్షల్ ఆర్ట్స్ లో బాగా రాణించడంతో సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయని తన తండ్రి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కావడంతో అదేమీ తనకు పెద్ద కష్టం కాలేదని అందుకే సినిమాల్లో హీరోగా ఎదిగి ఇప్పటివరకు మీ అందరికీ గుర్తున్నానని చెబుతున్నారు భానుచందర్.