రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో అర్చకులు గా విధులు నిర్వహిస్తున్న బావుసాయిపేట శ్రీనివాస్, చర్లపల్లి భాను లకు ముఖ్య అర్చకులు పదోన్నతి కలిపిస్తూ ఆలయ ఈఓ కె .వినోద్ రెడ్డి ఈ రోజు ఈఓ కార్యాలయంలో ఉత్తర్వులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో పరిపాలనా విభాగం ఏ ఈ ఓ శ్రవణ్, పర్యవేక్షకురాలు పూజిత, సీనియర్ అసిస్టెంట్ మంద సామి ,పురాణం వంశీ, నరేష్, ప్రధాన అర్చకులు ఈశ్వరిగారి సురేష్ తదితరులు ఉన్నారు.