శాంతియుత వాతావరణం లో వినాయక నిమజ్జనం జరపాలి - వేములవాడ రూరల్ సి ఐ శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల జిల్లా: వినాయక నిమజ్జనాన్ని శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని వేములవాడ రూరల్ సిఐ శ్రీనివాస్ తెలిపారు.గురువారం బోయినపల్లి మండల కేంద్రంలోని ఎన్నాడి రాధమ్మ ఫంక్షన్ హాల్ లో గణేష్ ఉత్సవ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

 Vinayaka Immersion Should Be Done In A Peaceful Atmosphere Vemulawada Rural Ci S-TeluguStop.com

మండలానికి చెందిన వినాయక మండపాల నిర్వాహకులతో ఎస్సై పృథ్వీధర్ గౌడ్ సమావేశం నిర్వహించగా, వేములవాడ రూరల్ సి ఐ శ్రీనివాస్ ముఖ్య అతిధి గా పాల్గొన్నారు,ఈ సందర్బంగా సమావేశం ని ఊద్దేశించి వేములవాడ రూరల్ సి ఐ మాట్లాడుతూ మండలంలో ఉన్న 23 గ్రామాల్లో మొత్తం 121 వినాయకులని ఆన్లైన్లో నమోదు చేసుకోవడం జరిగినదని, అట్టి అన్ని వినాయకులను జియో ట్యాగింగ్ చేసి ప్రతిరోజు బ్లూ కోల్ట్స్ మరియు పెట్రో కార్ సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారని అన్నారు.ఈ నెల 15,16 తేదీలలో ఎక్కువ మొత్తంలో వినాయకుల నిమజ్జనం ఉన్నదని నిమజ్జన సమయంలో డీజే లకు ఎలాంటి అనుమతులు లేవని ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం చేయాలని అన్నారు.

డీజేలు ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.నిమజ్జనం చేసేవారు వినాయకుడిని వాహనంలో ఎక్కించేటప్పుడు, చెరువులో నిమజ్జనం చేసేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలని లేనిచో ప్రమాదాలు జరగడానికి అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు .వినాయక నిమజ్జన సమయంలో మహిళలు, వృద్ధులు, చిన్న పిల్లలు చెరువు వద్ద జాగ్రత్తలు వహించి దూరంగా ఉండాలని, పెద్ద పెద్ద వినాయకులు ఉన్నవారు ముందు రోజే రూట్ ను చూసుకొని ఆ రూట్ ప్రకారమే వెళ్లాలని, వినాయక శోభాయాత్రకు ఎలాంటి ఆటంకం కలిగినా వెంటనే డయల్ 100 కు ఫోన్ చేయాలని ఆయన తెలిపారు.వినాయక మండపాల వద్ద మద్యం సేవించి ఆగడాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రూరల్ సి ఐ తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎస్సై పృథ్వీధర్ గౌడ్,హెడ్ కానిస్టేబుల్ సత్తయ్య గౌడ్, కానిస్టేబుల్ రాజ్ కుమార్ లు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube