చెత్తతో నిండిన రాజధాని ఎక్స్‌ప్రెస్.. ఇండియన్స్‌కు సివిక్ సెన్స్ లేదు..?

భారత దేశంలో చాలామంది ట్రైన్ జర్నీ చేసేటప్పుడు చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవాల్సి వస్తుంది.ఎందుకంటే కుర్చీ సీట్లు, ఎంట్రన్స్‌లు అన్ని చెత్తతో నిండిపోయి ఉంటాయి.

 Rajdhani Express Littered With Garbage Ignites Civic Sense Details, Train Cleanl-TeluguStop.com

రాజధాని ఎక్స్‌ప్రెస్( Rajdhani Express ) లాంటి లగ్జరీ రైలు అయినా, లోకల్ రైలు అయినా పరిస్థితి ఒకటే.ఎంతో మంది ప్రయాణికులు రైలులో చెత్త వేయడం అలవాటు చేసుకున్నారు.గోవా నుంచి ఢిల్లీ వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన ఒక వ్యక్తి ఈ విషయాన్ని ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.“భారతీయులు ఎందుకు ఇంత మురికిగా ఉంటారు?” అని ప్రశ్నిస్తూ, “మనకు నాగరికత లేదా? మనం అనాగరికులమా ” అని అనుమానించాడు.

Telugu Civic Sense, Indian Railways, Indian Trains, Indians, Public Hygiene, Rai

రెడిట్‌ ప్లాట్‌ఫామ్‌లోని “ఇండియన్ రైల్వేస్”( Indian Railways ) కమ్యూనిటీలో “yourstruly555555555” అనే యూజర్ నేమ్ గల వ్యక్తి “భారతీయులు ఎందుకు చాలా డర్టీగా ఉన్నారు? వారు తమ సొంత చెత్తతో ఎలా సుఖంగా ఉన్నారు? భారతీయులకు బేసిక్ సివిక్ సెన్స్( Basic Civic Sense ) ఎందుకు లేదు? రూ.2,700 టికెట్ గల రాజధాని రైలు ఎందుకు అలా ఉంది? రూ.1,800 దురంతో కంటే చాలా శుభ్రంగా ఉందా?” అని క్వశ్చన్ చేశారు.ఇదే పోస్ట్‌లో ఒక ఫొటో జోడించారు.అందులో ట్రైన్ ఫ్లోర్‌పై చెల్లాచెదురుగా ప్లాస్టిక్ సీసాలు, రేపర్లు కనిపించాయి.

“ప్రైసీ టిక్కెట్లు కొంటే ప్రజలు క్లీన్‌గా ఉంటారని అనుకోవడం తప్పు.వారు ఎప్పటికీ చెత్త వేస్తూనే ఉంటారు.ఎవరైనా వారిని ప్రశ్నిస్తే, వారు మిమ్మల్ని చెత్త తీసి డస్ట్‌బిన్‌లో( Dustbin ) వేయమని చెప్పేస్తారు.నేను అలాంటి అనుభవం పొందాను,” అని ఒక నెటిజన్ అన్నారు.“బాగా మనీ పే చేస్తున్నాం కదా ఆ డబ్బుతో చెత్త తీసే వారిని నియమిస్తే బాగుంటుంది కదా” అని ఒకరు అన్నారు.

Telugu Civic Sense, Indian Railways, Indian Trains, Indians, Public Hygiene, Rai

“కొన్ని వారాల క్రితం నా ముందు జరిగిన ఓ సంఘటనను మీకు చెప్తాను.నేను నిజాముద్దీన్-ఎర్ణాకులం మంగళా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నాను.రైలు ఒక గంట ఆలస్యమైంది.రాత్రి ఆలస్యంగా రైలు ఎక్కినా, అందులో చాలా శుభ్రంగా ఉంది.కానీ మరుసటి ఉదయం నిద్ర లేచినప్పుడు, క్లీనింగ్ స్టాఫ్( Cleaning Staff ) నా ముందు చెత్తను పారబోశాడు, ప్లాస్టిక్ బాటిళ్లను తీసి రైలు బయట ఎమర్జెన్సీ విండో నుంచి వేశాడు.నేను ఏమి చూశానో అర్థం కాలేదు.

ఇది క్షణంలో జరిగిపోయింది కాబట్టి నేను దీన్ని రికార్డ్ చేయలేకపోయాను.రైలులోని శుభ్రతను కాపాడే వారే దీనికి వ్యతిరేకంగా పనిచేశారు.

ప్రయాణికులు ఆ వ్యక్తిని తిట్టడం మొదలుపెట్టారు.అప్పుడు ఆ వ్యక్తి పై అధికారులకు ఫిర్యాదు చేయొద్దని నన్ను బుజ్జగించి, మిగిలిన చెత్తను తీసి వెళ్లిపోయాడు” అని మరొకరు కామెంట్ చేశారు.

“భారతదేశంలో సివిక్ సెన్స్ అనేది ఒక జోక్ మాత్రమే” అని మరొకరు అన్నారు. “క్లాసిక్ ఇండియన్స్” అని మరొక సోషల్ మీడియా యూజర్ రాశారు.“నార్త్ ఇండియా నుంచి వచ్చే రైళ్లు ఎప్పుడూ ఇలాగే ఉంటాయి.నేను ఒకసారి నిజాముద్దీన్-కెఎస్ఆర్ బెంగళూరు రాజధానిలో ప్రయాణించాను.

పరిస్థితి అదే.అన్ని ప్లేట్లు, నీటి బాటిళ్లు పై బెర్త్‌లో ఉండేవి.వాటిని శుభ్రం చేయించుకోవడానికి ఇన్‌చార్జ్‌ని పిలవలసి వచ్చింది.దక్షిణ భారతదేశ రైళ్లు చాలా బాగుంటాయి” అని మరొకరు అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube