వాడివేడిగా డొనాల్డ్ ట్రంప్ - కమలా హారిస్ డిబేట్.. ఎవరిది పైచేయంటే

అమెరికా అధ్యక్ష ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్న సంగతి తెలిసిందే.డెమొక్రాట్ అభ్యర్ది కమలా హారిస్( Kamala Harris ), రిపబ్లికన్ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్‌లు( Donald Trumps ) ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.

 Donald Trump Vs Kamala Harris Presidential Debate 2024 Highlights , Donald Trump-TeluguStop.com

ఎన్నికల్లో భాగంగా అధ్యక్ష అభ్యర్ధుల చర్చా కార్యక్రమం ఇప్పటి వరకు ఒక్కటి మాత్రమే జరిగింది.డెమొక్రాట్ అభ్యర్ధిగా అధ్యక్షుడు జో బైడెన్ రేసులో ఉన్నప్పుడు ట్రంప్‌తో ఆయన తలపడ్డారు.

అయితే ఆ డిబేట్ బైడెన్ కొంపముంచింది.ట్రంప్ దూకుడు ముందు ఆయన తేలిపోయారు.

ఇది ఆయన సామర్ధ్యంపై అనేక అనుమానాలను తీసుకొచ్చి.చివరికి పోటీలో నుంచే వెనుదిరిగేలా చేసింది.ఇప్పుడు రేసులోకి ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ వచ్చి ట్రంప్‌కు అన్ని విషయాల్లో పోటీ ఇస్తూ దూసుకెళ్తున్నారు.ఈ నేపథ్యంలో వీరిద్దరూ సెప్టెంబర్ 10న డిబేట్‌లో పాల్గొనబోతున్నారని తెలియగానే యావత్ ప్రపంచం ఆసక్తిగా తిలకించింది.

పెన్సిల్వేనియాలోని నేషనల్ కాన్‌స్టిట్యూషన్ సెంటర్ వేదికగా రెండవ ప్రెసిడెన్షియల్ డిబేట్ జరిగింది.

అమెరికా ఆర్ధిక పరిస్ధితి, అక్రమ వలసలు, గర్భవిచ్ఛిత్తి హక్కులు సహా పలు అంశాలపై ఇద్దరు నేతలు చర్చించుకున్నారు.

తొలి నుంచి కమలా హారిస్‌ను కమ్యూనిస్ట్‌గా పేర్కొంటూ విమర్శలు చేస్తున్న ట్రంప్ అదే కంటిన్యూ చేశారు.ఆమెను మార్క్సిస్ట్‌గా అభివర్ణిస్తూ విరుచుకుపడ్డారు. బైడెన్ – హారిస్ ( Biden – Harris )ఇద్దరూ కలిసి ఆర్ధిక వ్యవస్థను నాశనం చేశారని, తాను కరోనా సమయంలోనూ దేశ ఆర్ధిక వ్యవస్ధను రక్షించినట్లుగా ట్రంప్ గుర్తుచేశారు.

Telugu Biden Harris, Donald Trump, Donaldtrump, Kamala Harris, Kim Jong, Preside

ఈ వ్యాఖ్యలకు కమలా హారిస్ కౌంటరిచ్చారు.ట్రంప్ డిక్టేటర్ అని.ఆయన తప్పులను తాను , బైడెన్ సరిదిద్దామన్నారు.ట్రంప్‌కు నియంతలంటే ఇష్టమని, కిమ్ జోంగ్ ఉన్‌కు ( Kim Jong Un )లవ్ లెటర్స్ రాశారని ఆమె సెటైర్లు వేశారు.తాలిబన్లతోనూ ట్రంప్ చర్చలు జరిపారని, ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధం ఆగిపోవాలనే తాము కోరుకుంటున్నామని కమలా హారిస్ అన్నారు.

మహిళల అబార్షన్లపై ట్రంప్ నిషేధం విధించాలని అనుకుంటున్నారని.అత్యాచార బాధితురాళ్లకు సైతం మినహాయింపు ఇవ్వడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

Telugu Biden Harris, Donald Trump, Donaldtrump, Kamala Harris, Kim Jong, Preside

దీనికి ట్రంప్ స్పందిస్తూ .తాను గర్భవిచ్ఛిత్తి నిషేధానికి అనుకూలం కాదని, ఆ బిల్లుపై సంతకం చేయనని తేల్చిచెప్పారు.అయితే నెలలు నిండిన తర్వాత గర్భవిచ్ఛిత్తి ప్రమాదకరమని దానికి తాను వ్యతిరేకమని ట్రంప్ తెలిపారు.మొత్తం మీద ఇద్దరు నేతలు ఎక్కడా తగ్గకుండా చర్చలో పాల్గొన్నారు.అయితే ట్రంప్‌పై కమలా హారిస్ పైచేయి సాధించారని అమెరికన్ మీడియా అంటోంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube