తరుక్కుపోయిన మందుబాబుల మనుసు.. అదును చూసి..?

ప్రస్తుత రోజులలో చాలా మంది వ్యసనాలకు అలవాటు పడుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం.ఈ క్రమంలో యువత, పెద్దవారు ఇలా అన్ని వయసులవారు వారు డ్రగ్స్ , ఆల్కహాల్ అంటూ అనేక వ్యసనాలకు బాధితులు అవుతున్నారు.

 Drunkards In Andhra Pradesh Loot Seized Liquor During Police Destruction Details-TeluguStop.com

అయితే ఈ క్రమంలో చాలామందికి చుక్క లేనిదే ముద్ద కూడా దిగదన్న పరిస్థితి కూడా లేకపోలేదు.అయితే.

, మందు బాబు ప్రియులకు మద్యం బాటిల్లు( Liquor ) ఎక్కడ కనపడితే అక్కడ కొనుగోలు చేసి తాగడం మొదలు పెట్టేస్తుంటారు.ఈ క్రమంలో కొంతమంది మందుబాబులు( Drunkards ) చేసిన పనికి పోలీస్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.

Telugu Andhra Pradesh, Drunkards, Drunkardsloot, Guntur, Liquor, Loot, Seized Li

ఆంధ్రప్రదేశ్లోని( Andhra Pradesh ) గుంటూరులో అసెంబ్లీ ఎన్నికల సమయంలో పట్టుబడ్డ మద్యం బాటిల్ లను పోలీసులు( Police ) ధ్వంసం చేసే క్రమంలో కొంతమంది మందుబాబులు అడ్డుకున్నారు.ఈ క్రమంలో ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఈటకూరు రోడ్డులో నల్ల చెరువులోని డంపింగ్ యార్డ్ లో మందు సీసాలను ధ్వంసం చేయడానికి పూర్తి ఏర్పాట్లు చేశారు.నిజానికి ఇలాంటి మందు బాటిల్లను ప్రోక్లైన్ తో ధ్వంసం చేయిస్తారు.

ఈ క్రమంలో ప్రొక్లెయిన్‌ రావడానికి కాస్త సమయం పట్టడంతో మద్యం సీసాలను రోడ్లపై ఉంచారు.

Telugu Andhra Pradesh, Drunkards, Drunkardsloot, Guntur, Liquor, Loot, Seized Li

ఇక ప్రొక్లెయిన్‌ వచ్చిన తర్వాత మద్యం బాటిళ్లను ధ్వంసం చేయడం మొదలుపెట్టేసాక అక్కడ నుంచి అధికారులు వెళ్లిపోయారు.ఈ తతంగంని గమనించిన అక్కడ కొంతమంది స్థానికులు ఆ ప్రాంతానికి వచ్చి బాటిలను పట్టుకొని వెళ్లిపోయారు.పోలీసులు వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించగా.

వాళ్లు మాత్రం వృధాగా నేలపాలు చేస్తుంటే ఊరుకోము అంటూ తెలిపారు.కొంతమంది నుంచి మద్యం బాటిలను పోలీసులు స్వాధీనం చేసుకొని, పారిపోయిన వారిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.

ఇక గుంటూరు జిల్లా( Guntur District ) మొత్తం 50 లక్షలు విలువ మద్యం బాటిల్లును పోలీసులు సీజ్ చేసినట్లు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube